పడిలేచిన కెరటం అనే మాట గురించి భారతీయ సినీ పరిశ్రమలో చెప్పాల్సి వస్తే.. అందుకు సరైన ఉదాహరణగా నిలుస్తారు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. హీరోగా ఆయన చూడని రేంజి లేదు. కానీ అంత రేంజి నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయే స్థితికి చేరుకున్నారు అమితాబ్. కానీ మళ్లీ పుంజుకుని అన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడి.. తన కెరీర్‌ను సరికొత్తగా నిర్మించుకుని.. మళ్లీ ఒకప్పటి స్థాయికి చేరుకోవడంలో ఆయన చూపిన గుండె నిబ్బరం.. పడ్డ కష్టం ఎవరికైనా స్ఫూర్తినిచ్చేదే. అందుకే ప్రభుత్వం ఆయన్ని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్'తో సత్కరించింది.
రెండు నెలల కిందటే అమితాబ్‌కు అవార్డు ప్రకటించిన ప్రభుత్వం.. బుధవారం నాడు ఆయనకు అవార్డు ప్రదానం చేసింది. అమితాబ్ సతీమణి జయాబచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్‌లతో పాటు మరిందరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మవిభూషన్ పురస్కారాన్ని స్వీకరించారు అమితాబ్. అమితాబ్‌కు ఇదే తొలి పద్మ పురస్కారం కాదు. ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల్ని కూడా స్వీకరించారు. అమితాబ్‌తో పాటు మరో లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కూడా పద్మవిభూషన్‌కు ఎంపికయ్యారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు.