ఇండియన్ మెగాస్టార్ కి గాజు విగ్రహం

Update: 2017-05-13 05:53 GMT
అమితాబ్ బచ్చన్ ప్రపంచానికి తెలిసిన తొలి ఇండియన్ మెగాస్టార్. ఆరు అడుగులు ఎత్తు.. తెల్లని గెడ్డం.. 70 లో పడ్డ యువకుడు. అమితాబ్ పేరు వింటేనే సినిమా తెలిసిన ప్రతివాడికి ఒక గర్వం వస్తుంది. అతను పని చేసిన తీరు అతని ఆలోచనలు అతని సభ్యత అనీ కలిపి అతన్ని ఇప్పటి సినీ భీష్మగా  చెప్పవచ్చు. వయసులో బీష్ముడు ఏమో కానీ ఇప్పటికీ నాకు పని ఇవ్వండి నేను నేర్చుకుంటాను నేను చేస్తాను అని కొత్త నటులతో పోటీపడుతున్న ఏకలవ్యుడు మన బిగ్ బి.

అమితాబ్ సర్కార్ 3 శుక్రవారం దేశం మొత్తం విడుదలైంది. రాము గోపాల్ వర్మ తీసిన సర్కార్ కి ఇది మూడో భాగం. సర్కార్ లో అమితాబ్ శుభాష్ నాగ్రే పాత్రకు ప్రాణం పోశారు. అది అతను సృష్టించిన మాయాజాలం. అంతలా ఆ సినిమాని జనాలు ఆదరించారు. జీవితం ఏంటో ఎంత విలువైందో తెలిసిన మనిషి ఎంతటి కష్టం వచ్చిన నిబ్బరంగా కనిపించే ధీరుడుకి ఇప్పుడు కోల్ కత్తా లో ఆరు అడుగుల రెండు ఇంచీల ఫైబర్ గ్లాస్ తో ఒక విగ్రహం కట్టిస్తున్నారు. అమితాబ్ కు  ఒక గుడి కూడా ఏర్పాటు చేస్తున్నాము అని అల్ బెంగాల్ అమితాబ్ బచ్చన్ ఫాన్స్ అసోసియేషన్ అద్యక్షడు సంజయ్ పాతోడియా తెలిపారు.

25 కే‌జిలున్న అమితాబ్ విగ్రహాని సుబ్రతా బోస్ తయారుచేస్తున్నారు. అమితాబ్ పుట్టిన రోజుయినా అక్టోబర్ 11 నా ఆవిష్కరిస్తారు. దీన్ని నిర్మించడానికి సుమారుగా ఒక లక్ష ఖర్చు అయిందట. మన దేశంలో ఇది మొదటిసారి కాదు సినిమా నటులుకు గుడులు కట్టడం. సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుకి హీరోయిన్లు కూడా కోవెల కట్టి పూజలు చేసే సంధార్భాలు ఉన్నాయి. మన దేశం లో సినిమా అనేది ఒక పెద్ద జాతి అనేది మరోసారి తేటతెల్లమైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News