ఒక పే..ద్ద హీరో లోబడ్జెట్ సినిమాలో నటించటమా? అన్న ప్రశ్న తెలుగోళ్లను వేస్తే నో చెబుతారు. కానీ.. అన్నిచోట్ల అలా కాదు. కొన్ని కథల గురించి తెలిసినప్పుడు.. పాత్రలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు అదెంత భారీ చిత్రమన్న విషయాన్ని పట్టించుకోకుండా సినిమాను చేసే పెద్ద మనసున్న అగ్ర నటులు కొందరున్నారు. ఆ కోవలోకే వస్తారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్.
స్నేహం కోసం కొన్నిసార్లు.. ప్రత్యేక పరిస్థితుల్లో మరికొన్నిసార్లు.. కథ నచ్చి ఇంకొన్నిసార్లు కొన్ని సినిమాకు అమితాబ్ ఓకే చెప్పేస్తారు. అదే సమయంలో తన కారణంగా సదరు సినిమా నిర్మాత ఇబ్బంది పడకూడదని చాలావరకూ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంతవరకంటే.. తన దుస్తుల్ని తానే సమకూర్చుకునేంత. వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఇలాంటివి కేవలం అమితాబ్ కు మాత్రమే సాధ్యమేమో?
తాజాగా ఆయనో మరాఠి సినిమా (ఎబీ ఆణీ సీడీ) లో నటిస్తున్నారు. సాధారణంగా మరాఠి సినిమాల బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో.. తన కారణంగా నిర్మాతకు భారం కాకూడదని బిగ్ బి డిసైడ్ అయ్యారట. క్యాస్టూమ్స్ ను సిద్ధం చేసుకునేందుకు కొలతల కోసం టైలర్ ను పంపితే.. ఆ అవసరం లేదని.. తనకు అవసరమైన దుస్తుల్ని తానే సమకూర్చుకుంటానని చెప్పేసి సర్ ప్రైజ్ చేశారట.
షూటింగ్ వేళ.. తన సొంత వార్డురోబ్ నుంచి దుస్తుల్ని తెచ్చుకున్నారట. 20 రకాలు దుస్తుల్ని తీసుకొచ్చి.. ఇందులో ఏది బాగుందో చెబితే.. వాటిని తాను వేసుకుంటానని చెప్పిన వైనాన్ని సదరు నిర్మాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ చెప్పుకొచ్చారు. ఏమైనా.. ఇలాంటివి బిగ్ బికి మాత్రమే సాధ్యమవుతాయేమో?