అందమైన అధరాలు.. కొంటెచూపులు ఈ భామ సొంతం!

Update: 2020-05-02 02:30 GMT
అమైరా ద‌స్తూర్.. ఈ మ‌ధ్యే తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. మ‌న‌సుకు న‌చ్చింది అంటూ వ‌చ్చింది కానీ ఈ భామ సినిమా మాత్రం ప్రేక్ష‌కుల మ‌న‌సుకు న‌చ్చ‌లేదు. కానీ అమైరా అందం మాత్రం బాగా న‌చ్చింది. అందుకే తెలుగులోనే సెటిల్ అయిపోవాల‌ని చూస్తుందట. అందుకే అందాల ఆర‌బోత‌నే ఎక్కువ‌గా న‌మ్ముకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అందాల విందు మాత్రం మాములుగా లేదు.. కావాలంటే పైన ఉన్న ఫోటో ఒక్క‌సారి చూడండి. కొంటెగా తినేసేలా చూస్తుంది కదా..! అంటే భామను చూస్తే ఎంతటివారైనా అలా ఫిదా అయిపోవాల్సిందే. గతంలో రాంచరణ్ ధృవ సినిమాలో హీరోయిన్ గా అమైరాకు అవకాశం అందినట్టే అంది చేజారిందట.

ఆ త‌ర్వాత చాలా సినిమాలు అనుకున్నా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. ఇక లాభం లేదని యంగ్ హీరోలతో స‌ర్దుకుపోతుందట. త‌మిళ‌నాట ఈ భామ ధ‌నుష్ తో న‌టించిన అనేగ‌న్ మంచి విజ‌య‌మే సాధించింది. అయినా అమైరాను ఎందుకో మ‌న ద‌ర్శ‌కులు, హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా బాలీవుడ్ లో ముద్దుల వీరుడు ఇమ్రాన్ హ‌ష్మీతో న‌టించిన మిస్ట‌ర్ ఎక్స్ కూడా ఫ్లాప‌వ‌డంతో.. చిన్న సినిమాలు చేసుకుంటుంది అమైరా. ప్రస్తుతం ఇదిగో ఇలా వేడెక్కించే ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక నెట్టింట్లో అమ్మడికి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో అమైరా దొండపండులాంటి అధరాలు మతేక్కిస్తున్నాయి. అందాల బాణం అంతంత మాత్రంగా విడిచినా పిక్‌ మాత్రం సింప్లీ సూపర్ అంటున్నారు అభిమానులు. అందుకే రెస్పాన్స్‌ కూడా అదే రేంజ్‌లో వస్తోంది.
Tags:    

Similar News