ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా బాహుబలి. ముందుగా సినిమాను ఒక్క పార్ట్‌లోనే తీయాలనుకున్నారు. అయితే కథను ఒక పార్ట్‌లో పూర్తిగా చెప్పలేమనే ఉద్దేశ్యంతో జక్కన్న చాలా తెలివిగా సస్పెన్స్‌లో ఉంచి మొదటి పార్ట్‌ను ముగించి రెండవ పార్ట్ తెరకెక్కించాడు. సినిమా కథ సింపుల్‌గా ఉన్న అందులోని పాత్రలు చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. దాంతో ఆ పాత్రలను బేస్ చేసుకుని వెబ్ సిరీస్‌లు రూపొందడంతో పాటు బుక్స్ కూడా వస్తున్నాయి.
ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ ఇప్పటికే బాహుబలికి ముందు కథతో శివగామి పాత్రను బేస్ చేసుకుని బుక్ రాశాడు. మొదటి పార్ట్‌కు మంచి టాక్ వచ్చింది. శివగామి తన రాజ్యంను ఎలా కాపాడుకుంటూ వచ్చింది, ఆమెకు సంబంధించిన పాలన విషయాలను రచయిత బుక్‌లో వివరించాడు. బాహుబలి ముందు కథతో ఏకంగా మూడు బుక్స్ రాస్తానంటూ ప్రకటించిన ఆనంద్ నీలకంఠన్ తాజాగా రెండవ పార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈసారి బుక్‌కు చతురంగా అనే పేరును పెట్టాడు.
ఈ బుక్‌లో శివగామి మరియు కట్టప్పలకు సంబంధించిన కథనాలు ఉన్నాయి. ఈ బుక్ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. బుక్ ఖరీదు 313 రూపాయలుగా నిర్ణయించారు. ఇంగ్లీష్ లో ఉన్న ఈ బుక్ కు మంచి సేల్స్ ఉన్నాయంటూ రిపోర్ట్ అందుతోంది. మొత్తానికి బాహుబలి విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఏదో ఒక మార్గంలో మేకర్స్ క్యాష్ చేసుకుంటూనే ఉన్నారు.