పంచదార బొమ్మ తర్వాత మళ్లీ ఇదే

Update: 2015-06-29 09:30 GMT
''పాటల రచయితగా ఇప్పటికే 650 పాటలు రాశాను. అందులో కొన్ని పెద్ద హిట్టయ్యాయి. మరికొన్ని పెద్దగా విజయం సాధించలేదు. అయితే అవన్నీ కలిపి నాపై కుట్ర పన్నాయి. ఇప్పుడు బాహుబలిలో పచ్చబొట్టేసి పాట రాసే అవకాశం, అదృష్టాన్ని కలిగించాయి. నేను రాసిన ఈ పాటను రోజుకు లక్ష మంది యూట్యూబ్‌లో వింటున్నారంటే ఎంత పెద్ద హిట్టో వర్ణించనక్కర్లేదు'' అంటున్నారు అనంత శ్రీరామ్‌.

సోడాబుడ్డి కళ్లద్దాల వెనక బోలెడంత విజ్ఞానం దాగుంది అని మరోసారి అర్థమయ్యేలా చెప్పాడు అనంత శ్రీరామ్‌. పచ్చబొట్టేసి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌. ఈ పాటను రాయడం వెనుక 70రోజుల మథనం ఉందని అంటున్నాడు రచయిత. ఈ పాటలో డ్యాన్స్‌ చేసే తారలిద్దరూ పాత్రల స్వభావం మేరకు పెద్దగా చదువుకున్నవాళ్లు కాదు కాబట్టి అందుకు తగ్గట్టే సరళమైన పదాల్ని, మాట్లాడుకునే పదాల్ని వేసి రాశానని అన్నారు. అలా రాయడం పెను సవాలే. కానీ దానిని ఛాలెంజ్‌గా తీసుకుని రాశా అని చెప్పుకొచ్చారు.          నా కెరీర్‌లో పంచదార బొమ్మా బొమ్మా (మగధీర) తర్వాత మళ్లీ అంత హిట్టయిన పాట ఇది. దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి నుంచి తొలి ప్రశంస అందుకున్నానని చెప్పారు అనంత శ్రీరామ్‌.

Tags:    

Similar News