తెలుగు.. తమిళం.. కన్నడ. .మలయాళం.. అనన్య పాండే

Update: 2022-01-12 03:47 GMT
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే అనూహ్య విజయాలను దక్కించుకుని ఇండస్ట్రీలో టాప్ స్టార్‌ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారిపోయింది. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకునేందుకు అనన్య పాండే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. సోషల్‌ మీడియాలో అందాల ప్రదర్శణ మొదలుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రత్యేకతను చాటుకుంటూ ప్రేక్షకులకు తన సొంత ఇమేజ్ తోనే పరిచయం అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాల్లో నటిస్తోంది. అందులో లైగర్‌ సినిమా ఒకటి.

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్‌ సినిమా కు బాలీవుడ్ స్టార్ కరణ్‌ జోహార్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పూరి మరియు ఛార్మిలు కలిసి కరణ్‌ తో నిర్మిస్తున్నారు. అనన్య పాండేను లైగర్‌ సినిమా కోసం ఒప్పించింది కరణ్‌ జోహార్‌ అనే టాక్‌ ఉంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న మొదటి పాన్‌ ఇండియా మూవీ ఇది. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న లైగర్‌ సినిమా తో సౌత్‌ కు పరిచయం కాబోతున్న అనన్య పాండే చాలా ఎగ్జైట్‌ తో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. తప్పకుండా ఈ సినిమా తో సౌత్‌ లో గుర్తింపు దక్కించుకుంటాననే నమ్మకంతో ఉంది. ఇదే సమయంలో ఆమె టెన్షన్‌ పడుతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది.

ఒకే సారి నాలుగు కొత్త సినిమా పరిశ్రమల్లోకి ప్రవేశించడం ఎగ్జైటింగ్ గా మరియు భయంగా ఉంది. ఈ సినిమా తో అక్కడి ప్రేక్షకులకు దగ్గర అవుతాను అనే నమ్మకం ఉంది. తప్పకుండా ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ను సౌత్‌ లో ఇస్తుందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం హిందీ సినిమాలకే పరిమితం అయ్యి బాలీవుడ్‌ ప్రేక్షకులకు మాత్రమే చేరువ అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే ఇప్పుడు మాత్రం ఏకంగా బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా లైగర్ తో పరిచయం అవ్వబోతుంది. ఈ ఏడాది ఆగస్టులో విడుదల కాబోతున్న లైగర్ సినిమా తర్వాత ఈ అమ్మడు అక్కడ ఇక్కడ చాలా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. విజయ్‌ దేవరకొండ మరియు అనన్య పాండేల కాంబో రొమాన్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయనే నమ్మకంగా యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News