కొత్త దర్శకుడు రవికాంత్ మెరెపు తీసిన సినిమా ''క్షణం''. అయితే ఈ సినిమాతో ఇతగాడు ఇండస్ర్టీలో ఏ రేంజులో నిలబడతాడు అనే విషయం కంటే కూడా.. ఇప్పుడు అందరూ మరో నలుగురి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ నలుగురికీ ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఎంతో అవసరం.
ఇప్పటివరకు లీడ్ హీరోగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కించుకోలేదు అడివి శేష్. అందుకే ఈ సినిమా కుర్రాడికి చాలా కీలకం. లేకపోతే విలన్ వేషాలకు.. సైడ్ క్యారెక్టర్ లకు పరమితం అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఇకపోతే మన గరం గాళ్ అదా శర్మ గురించి చెప్పేదేముంది. మెయిన్ హీరోయిన్ గా ఈమెకూ ఒక్క హిట్టు కూడా లేదు. మొన్న భారీగా హీటెక్కించినా కూడా గరం సినిమా ఆకట్టుకోలేదు. అలాగే యాంకర్ అనసూయ చాలా వెయిట్ చేసి సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో తొలి ఎటాక్ చేసినా.. సినిమా ద్వారా ఆమెకు వచ్చిన లాభమేమీ లేదు. అందుకే క్షణం హిట్టయితే.. ఆమె పాత్రకు పేరొస్తే.. ఇక అనసూయ వెండితెర మీద కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టినట్లే.
మరి ఆ నాలుగవ వ్యక్తి ఎవరనేగా మీరు అడగబోతోంది? ఇంకెవరు.. నిర్మాత పివిపి సాబ్. బలుపు సినిమా తప్పించి.. పివిపి కి తెలుగు తమిళంలో అసలు హిట్టయిన ప్రొడక్షన్ వెంచర్ ఒక్కటి కూడా లేదు. మొన్ననే సైజ్ జీరో తో మరో భారీ డిజాష్టర్ చవిచూశారు. అందుకే ఆయనకు కూడా ఈ ''క్షణం'' సక్సెస్ చాలా అవసరం. మరి ఈ నలుగురి పేట్ ఎలా మారుతుందో చూడాలంటే.. ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే.