పవన్ ని ఇమిటేట్ చేస్తున్న అనసూయ

Update: 2015-11-18 11:30 GMT
ఈ ప్రపంచంలో ప్రతీ వెధవా పవన్ కళ్యాణ్ ఫ్యానే అంటూ బ్రహ్మీ ఓ కౌంటర్ వేశాడు. అది కూడా మెగా ఫ్యామిలీ మూవీయే కానీ.. గత కొన్నేళ్లుగా పవన్ ఫ్యాన్ అనడం,  ఇమిటేట్ చేయడం బాగా ఎక్కువైంది. నితిన్ లాంటి హీరోలయితే.. తమ అభిమానాన్ని ఓపెన్ గానే ప్రదర్శిస్తూ ఉంటారు.

హీరోయిన్స్ లో అయితే.. పవన్ కి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కోసం అభిమానాన్ని అరువు తెచ్చుకునే వాళ్లు కూడా ఉన్నారు. కానీ జబర్దస్త్ సుందరి అనసూయ మాత్రం పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఆడిపాడే ఛాన్స్ వచ్చినా వద్దుపొమ్మంది. ఐటెం సాంగ్ చేయమనడంతో అవకాశాన్ని కాదనుకుంది అనసూయ. మరి అలాగని పవన్ అంటే అభిమానం లేదని అనుకోవడం మాత్రం పొరపాటే. రీసెంట్ గా కుమారి 21ఎఫ్ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి వచ్చిన ఈ సుందరి.. పవర్ స్టార్ ని ఇమిటేట్ చేస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చింది.

మెడ వెనక్కు చెయ్యి పెట్టుకుని ఓరగా చూడ్డం పవర్ స్టార్ స్టయిల్. ఆ మధ్య మెగాస్టార్ ని కూడా బర్త్ డే సందర్భంగా ఇదే పోజ్ పెట్టాలని ఫ్యాన్స్ అడిగారు. అంతలా పాపులర్ ఈ స్టిల్. సింపుల్ గా చెప్పాలంటే పవర్ స్టార్ ట్రేడ్ మార్క్ స్టయిల్ ఇది. మరి ఇలాంటి పోజునే ఇస్తూ.. పవర్ స్టార్ పై తన అభిమానాన్ని చెప్పకనే చెప్పింది అనసూయ. ప్రస్తుతం ఈ భామ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగార్జున మరదలిగా నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా జనాల ముందుకు రానుండగా... తన చెల్లెలు వైష్ణవిని హీరోయిన్ చేసేందుకు అనసూయ ట్రై చేస్తోందని టాలీవుడ్ టాక్.
Tags:    

Similar News