ఇక నుంచి బుజ్జి అంటే అనసూయే

Update: 2015-12-25 17:30 GMT
అక్కినేని నాగార్జున అచ్చ తెలుగుదనంతో తీస్తున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయన. ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైద్రాబాద్ లో ఘనంగా నిర్వహించారు. నాగ్ లాంటి అందగాడి పక్కన ఎంతమంది ముద్దుగుమ్మలున్నా.. నాగార్జునే ప్రత్యేకంగా కనిపిస్తారు. కానీ.. ఇందులో జబర్దస్త్ అనసూయ కూడా ఓ కేరక్టర్ చేయడమే విశేషం.

అనసూయ ఇంతకు ముందే ఒకటి రెండు సినిమాల్లో చేసింది కానీ.. అవేవీ రిలీజ్ దగ్గరకు రాలేదు. చిన్ని తెరపై నుంచి వెండితెరపై మెరవాలన్న అనసూయ కోరిక తీరుస్తున్న తొలిచిత్రం సోగ్గాడే చిన్న నాయన. ఈ సందర్భంగా ఓ సాంగ్ లాంఛ్ చేయడం కోసం.. అనసూయను స్టేజ్ పైకి పిలిచింది యాంకర్ సుమ. బ్యాక్ ఓపెన్ జాకెట్ తో వీలైనంతగా హీరోయిన్ కళను బాగానే ప్రొజెక్ట్ చేసిందీ జబర్దస్త్ సుందరి.

స్టేజ్ పై అనసూయ మాట్లాడిన మాటల గురించి కూడా స్పెషల్ గా చెప్పుకోవాలి. సుమ అక్క బిజీగా ఉన్నపుడు.. చాలానే ఆడియో ఫంక్షన్స్ కోసం స్టేజ్ పైకి వచ్చానంది అనసూయ. అయితే... తనను ఇటువైపు నుంచోవడం నుంచి అటువైపు కూర్చునేలా చేసిన మూవీ సోగ్గాడే చిన్ని నాయన అంటూ.. కొంచెం ఉద్వేగానికి లోనైంది. అలాగే తన కేరక్టర్ పేరు చెప్పచ్చా అంటూ డైరెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది. తన పేరు బుజ్జి అని చెప్పి.. 'ఇక నుంచి మీ అందరికీ నేనే బుజ్జి' అంటూ తన స్టైల్ లో గారాలు పోతూ చెప్పింది అనసూయ.
Tags:    

Similar News