ఫొటోటాక్‌ : బాబోయ్‌ ఆ చూపేంటండి బాబు

Update: 2020-08-27 11:10 GMT
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ప్రతి వారం సోషల్‌ మీడియాలో రెండు మూడు ఫొటో షూట్స్‌ ను రెగ్యులర్‌ గా పోస్ట్‌ చేస్తూనే ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఆమెలో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు అనేది ప్రతి ఫొటో షూట్‌ కు వచ్చే కామెంట్స్‌. అయితే ఈసారి మాత్రం మరింత ప్రత్యేకం అనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో ఈమె నేడు పోస్ట్‌ చేసిన ఈ ఫొటో మరింతగా ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు. బ్లాక్‌ అండ్‌ రెడ్‌ కాంబినేషన్‌ లో ఆమె ధరించిన కాస్ట్యూమ్స్‌ కలర్‌ ఫుల్‌ ఉండి ఆమెను ప్రజెంట్‌ చేయడంతో పాటు చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి.

ఇక ఈ ఫొటోలో ఆమె చూపు మరీ గుచ్చుకుంటుందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. నెట్టింట ఆమె గురించిన చర్చ సాదారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి అది మరి కాస్త ఎక్కువ అయ్యింది. నేడు ప్రసారం కాబోతున్న జబర్దస్త్‌ షోలో ఈమె ఈ డ్రస్‌ తో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక వైపు బుల్లి తెరపై మరో వైపు వెండి తెరపై సందడి చేస్తున్న అనసూయ రోజు రోజుకు తన క్రేజ్‌ ను పెంచుకుంటూ వెళ్తోంది. త్వరలో ఈమె ఓటీటీలో కూడా కనిపించే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News