ఒక తల్లిగా అనసూయ ఆవేదన

Update: 2020-06-14 07:00 GMT
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో పలు సామాజిక విషయాల గురించి స్పందిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్‌ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తన పిల్లల విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసింది. మహమ్మారి వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో పిల్లలను స్కూల్‌ కు పంపించకుండా ఆన్‌ లైన్‌ క్లాస్‌ లు చెప్పిస్తున్నారు. దాదాపు అన్ని స్కూల్స్‌ కూడా ఆన్‌ లైన్‌ క్లాస్‌ లు ప్రారంభించాయి.

గంటల తరబడి స్క్రీన్‌ ముందు పిల్లలు ఉండాల్సి రావడంపై అనసూయ ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలు ఆన్‌ లైన్‌ క్లాస్‌ లు వింటున్న విధానం గమనిస్తూ బాధపడుతున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. వారిలో నేను ఉంటాను. పదేళ్లు కూడా దాటని పిల్లలు గంట తరబడి స్క్రీన్‌ ముందు క్లాస్‌ ల పేరుతో ఉండటం వల్ల వారి మానసిక పరిస్థితి కూడా ప్రభావం చెందే అవకాశం ఉందని.. పదేళ్ల లోపు పిల్లల ఆన్‌ లైన్‌ క్లాస్‌ ల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అనసూయ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసింది.

అనసూయ లేవనెత్తిన ఈ విషయంపై చాలా మంది పాజిటివ్‌ గా రియాక్ట్‌ అయ్యారు. మీ ఆలోచన సరైనది పదేళ్ల లోపు పిల్లలకు ప్రత్యామ్నాయ మార్గంగా ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. గంటల తరబడి ఆన్‌ లైన్‌ క్లాస్‌ లను పిల్లలు వినలేక పోతున్నారు అంటూ మరి కొందరు కామెంట్‌ పెట్టారు. మొత్తానికి ఒక తల్లిగా అనసూయ ప్రస్తుతం పిల్లల విషయంలో చాలా ఆందోళన చెందుతోంది. ఎంత స్టార్‌ యాంకర్‌ అయినా అనసూయ కూడా ఒక తల్లిలా పిల్లల విషయంలో తల్లడిల్లుతోంది అంటూ నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News