స్పెషల్ సాంగ్స్ లో అనసూయ..?
అనసూయ ఇప్పుడు యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తన లుక్ తో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ భామ మరికొంత మంది స్టార్ హీరోలతో స్పెషల్ సాంగ్స్ లో మెరిసే అవకాశం లేకపోలేదు. అయితే అనసూయ మాత్రం స్పెషల్ సాంగ్ లో తాను నటించనని చెబుతోంది. సినిమాలో తనకొక పాత్ర ఉండి దానితో పాటు సాంగ్ కి లింక్ ఉంటేనే నటిస్తుందట.
స్పెషల్ సాంగ్ లో గ్లామర్ గా మాత్రమే కనిపిస్తామని, మంచి పాత్ర లభిస్తే నటిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతోంది. అందువలన ఈ రెండు కలిసి ఉండేలా ఛాన్స్ వస్తే నటిస్తానని చెబుతోంది. వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తాను బుల్లి తెరను పక్కన పెట్టేస్తుందనే వార్తలపై స్పందిస్తూ.. తనకు క్రేజ్ వచ్చింది యాంకర్ గా చేయడం వలనే.. అనీ ఎప్పటికి దానిని మాత్రం వదులుకోననీ స్పష్టం చేసింది.