అనసూయ ఇంకో ఛాన్స్ కొట్టేసింది

Update: 2015-11-23 09:30 GMT
పవన్ కళ్యాణ్ పక్కన ఐటెం సాంగ్ చేయమంటేనే కుదరదని చెప్పిన రేంజి అనసూయది. ఐతే ఇంకో ఇద్దరు ఐటెం భామలతో కలిసి సాంగ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని తెలివిగానే ఆ ఆఫర్ తిరస్కరించింది అనసూయ. ఐతే ఇప్పుడు సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంటోంది. మన్మథుడు నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయనా’లో ఓ కీలక పాత్ర చేస్తున్న అనసూయ.. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీకి ఓకే చెప్పింది ఈ టీవీ యాంకర్.

అడివి శేష్ - ఆదా శర్మ జంటగా ‘క్షణం’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అనసూయకు ఓ కీ రోల్ ఇచ్చారు. సినిమాకే హైలైట్ గా ఉండే పాత్ర కావడంతో ఒప్పేసుకుందట అనసూయ. సస్పెన్స్ - రొమాన్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అనసూయ పాత్ర కొంచెం హాట్ హాట్ గానే ఉంటుందని అంటున్నారు. ఓవైపు ఇలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూనే టీవీల్లో - ఆడియో ఫంక్షన్ లలో యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది అనసూయ. మొత్తానికి ఈ జబర్దస్త్ భామ తన కెరీర్ ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటోంది.
Tags:    

Similar News