అనసూయతో లేట్ నైట్ కామెడీ
ఆల్రెడీ అనసూయ అంటేనే ఒక టాప్ కామెడీ ప్రోగ్రామ్ కు మాజీ యాంకర్.. అలాంటి సుందరాంగితోనే ఈ లేట్ నైట్ కామెడీలు ఏంటో మరి అన్నట్లుగా ఉంది.. గత రాత్రి కమెడియన్ వెన్నెల కిషోర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే. మనోడు సరదాగా సోషల్ నెట్ వర్క్ సైట్ లో పేల్చిన పలుకులే కాని.. అవి కామెడీ కంటే ఎక్కువగా అభిమానులకు కాస్త కోపం తెప్పించేవిలా ఉన్నాయి.
ఈరోజు ''క్షణం'' సినిమా విడుదలవుతున్న సందర్భంగా.. యాంకర్ అనసూయకు చాలామంది విషెస్ చెప్పారు. అందుకే రైటర్ బి.వి.ఎస్.రవి కూడా ఉన్నారు. అనసూయ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను పొద్దున్నే ఫస్ట్ షో చూస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక కామెడీ చేయడానికి కంకణం కట్టుకున్న వెన్నెల కిషోర్.. వచ్చే జన్మలోనైనా అనసూయగా పుడితే మీ అభిమానం చూరగొనొచ్చు అంటూ కామెంట్ చేశాడు. అక్కడితో ఆగాడా.. అనసూయ అంతటి అందం పొందడం కష్టం అని రవి రిప్లయ్ ఇస్తే.. ''నిజమే ఐశ్వర్య ఇన్ జజ్బా (సినిమా).. అలాగే అనసూయ కాస్బా.. ఈ ప్రపంచంలో అంతటి అందగత్తెలు ఇంకా ఉండరేమో'' అంటూ ప్రాసలో చమత్కరించాడు.
ఈ లేట్ నైట్ కామెడీపైన ఎట్టకేలకు రెస్పాండ్ అయిన అనసూయ.. బాబూ ఆపండి.. ఏంటీ కామెడీలు అంటూ సింపుల్ గా గుడ్ నైట్ చెప్పేసింది.