2019లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దూల్ కలాం బయోపిక్ వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 2018 నుంచి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్న రీతిలో ప్రముఖుల కథలు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ లో అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా నిర్మించిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఇక ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితాధారంగా నిర్మించిన ‘కథానాయకుడు’ చిత్రం విడుదలకు సిద్ధమయింది.
ఇక బాలీవుడ్లో ప్రముఖ క్రీడాకారుల జీవితాధారంగా పలు చిత్రాలు తీసి ఘన విజయాలు సాధించారు. అమీర్ ఖాన్ నటించిన దబాంగ్ ఓ మల్ల యోధుడి చిత్రమే..ఇక ప్రముఖ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ జీవితాధారంగా ‘ఏ బీలియన్ డ్రీమ్’ బయోపిక్ గా తీశారు. అలాగే భారత్ వన్డే కెప్టెన్ ధోనిపై ఒక చిత్రం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అలాగే టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ పరిటాల రవి జీవితం ఆధారంగా రక్తచరిత్ర1, రక్తచరిత్ర 2 తీశారు. అలాగే త్వరలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
2018లో బయోపిక్ ల హవా కొనసాగింది. దీంతో 2019లోనూ ఈ ట్రెండ్ కొనసాగేలా కన్పిస్తుంది. అబ్దూల్ కలాం జీవితం ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కనుంది. అభిషేక్ అగర్వాల్, టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ఏకమై ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని అన్ని భాషల్లో గ్రాండ్ గా నిర్మించాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కఫూర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అబ్దూల్ కలాం పాత్రను ఈయన చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం.
ఈ బయోపిక్ కి ఇంకా దర్మకుడు ఖరారు కాలేదు. వేపన్స్ ఆఫ్ పీస్ అనే బుక్ ఆధారంగా కలామ్ బయోపిక్ స్ర్కిప్ట్ ను రాజ్ చెంగప్ప రెడీ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసి బయోపిక్ ను వచ్చే ఏడాది వరకు గ్రాండ్ గా లాంచ్ చేసి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు