తెలుగు మాట్లాడ్డమే ఆమె అసెట్

Update: 2017-11-09 04:53 GMT
పెళ్లిచూపులు మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. తొలి చిత్రంతోనే  తన ట్యాలెంట్ ని.. మేకింగ్ స్టైల్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. పెళ్లి చూపులు తర్వాత ఈ దర్శకుడు తీయబోయే మరుసటి చిత్రంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ద బ్యానర్ల నుంచి భారీ ఆఫర్స్ వచ్చినా.. తను స్వేచ్ఛగా సినిమా తీయాలనే తలంపుతో.. మళ్లీ తన స్టైల్ లోనే ఓ చిన్న సినిమానే చేయబోతున్నాడు తరుణ్ భాస్కర్.

ఇప్పటికే స్టోరీ.. స్క్రిప్ట్ సిద్ధం కాగా.. వెళ్లిపోమాకే చిత్రంలో నటించిన విష్వక్ సేన్ ను హీరోగా తీసుకున్నారనే టాక్ ఉంది. ఇప్పుడీ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసేశారని అంటున్నారు. బ్యూటీ అనీషా ఆంబ్రోస్ ను తరుణ్ భాస్కర్ తన సినిమాలో హీరోయిన్ గా ఖాయం చేసుకున్నాడట. తన మదిలో ఉన్న పాత్ర కోసం.. చాలామంది అమ్మాయిలనే పరిశీలించిన ఈ దర్శకుడు.. చివరకు అనీషా ఆంబ్రోస్ దగ్గర తన సెర్చింగ్ ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఆన్ స్క్రీన్ పై ఫ్రెష్ నెస్ ఒలికించడంతో పాటు.. తెలుగు పర్ఫెక్ట్ గా వచ్చిన అమ్మాయి అయి ఉండాలని భావించాడట తరుణ్ భాస్కర్.

తెలుగు చక్కగా మాట్లాడగలిగే అనీషా ఆంబ్రోస్ ను.. అందుకే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కామెడీ జోనర్ లో తెరకెక్కనున్న ఈ మూవీ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా.. త్వరలోనే వర్క్ షాప్స్ నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. అవి పూర్తయిన తర్వాత.. మూవీపై అనౌన్స్ మెంట్ చేస్తారట.
Tags:    

Similar News