అనిత భర్త 'నువ్వు నేను' చూపించేశాడు

Update: 2017-04-19 12:42 GMT
 ఉదయ్ కిరణ్ తో కలిసి నువ్వు నేను మూవీలో నటించిన హీరోయిన్ అనిత. ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో బాగానే అవకాశాలు అందుకున్నా.. ఆ తర్వాత మాత్రం ఈ భామకు అంతగా కలిసి రాలేదు. దీంతో టాలీవుడ్ నుంచి ఈ భామ మెల్లగా ముంబై షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత హిందీ సీరియల్స్ లో వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటూ కెరీర్ బాగానే కంటిన్యూ చేస్తోంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపకుంది. ఏప్రిల్ 14న తన 35వ పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చింది అనిత. ఈ పార్టీని ఆమె భర్త రోహిత్ రెడ్డి నిర్వహించడం విశేషం. 2013లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోగా.. ఈ బర్త్ వేడుకలో వీరిద్దరే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అందరి ముందే లిప్ టు కిస్ లాగించేసి.. ఓ రేంజ్ లో రచ్చ చేసి పారేశారు. పలువురు బాలీవుడ్ నటులతో పాటు.. హిందీ సీరియల్స్ లో నటించే కో స్టార్స్ ను ఈ పార్టీకి పిలిచారు అనిత దంపతులు.

'నా లైఫ్ లో స్ఫూర్తి నింపిన.. నిజాయితీ గల.. మంచి వ్యక్తి.. నా బెస్ట్ ఫ్రెండ్.. నా లవర్.. నా సోల్ మేట్.. నా జీవితం.. అన్నీ నాకు అనితే' అంటూ రోహిత్ రెడ్డి చెప్పిన మాటలు మాత్రం అందరినీ కదిలించేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News