దక్షిణాది సీనియర్ స్టార్లతో కలిసి నటించి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు శ్రీప్రియ. తమిళ సీనియర్ హీరోలు శివాజీ గణేషణ్, రజనీకాంత్, శివకుమార్, తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ వంటి తదతర హీరోలతో నటించారు. ఐదు భాషల్లోనూ నటించి నటిగా గుర్తింపుని పొందిన శ్రీప్రియ ఇటీవల విక్టరీ వెంకటేష్ నటించిన `దృశ్యం` చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారామె.
టాలీవుడ్ లో ఆమె డైరెక్ట్ చేసిన తొలి చిత్రం `దృశ్యం` సంచలన విజయం సాధించడంతో ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా వుంటున్న ఆమె తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి తన కూతురు స్నేహ పెళ్లి కారణం కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. రాజ కుమార్ సేతుపలిని 1988లో వివాహం చేసుకున్నారు శ్రీప్రియ. ఈ దంపతులకు ఓ అబ్బాయి, అమ్మాయి వున్నారు. అబ్బాయి పేరు నాగార్జున, అమ్మాయి పేరు స్నేహ.
హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందం స్నేహ సొంతం. ఆమె వివాహం త్వరలో జరగనుంది. అయితే రెండు సార్లు జరగనుండటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 6న లండన్ లో అన్మోల్ శర్మ అనే యువకుడితో స్నేహ వివాహం జరగబోతోంది. అయితే భారత్ లోని అతిథుల కోసం చెన్నైలో సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం జరపబోతున్నారు.
ఈ వివాహ వేడుకను ఏప్రిల్ 4,5,6 తేదీల్లో ఏర్పాటు చేసినట్టుగా కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా చెన్నైలో జరిగే వివాహానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారని తెలిసింది.