తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాత్తే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా వల్ల ఆలస్యం అయిన ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. రజినీకాంత్ సినిమా అంటే తెలుగు మార్కెట్ లో మంచి రేటు పలికేది. కాని ఇప్పుడు గతంలో మాదిరిగా టాలీవుడ్ లో రజినీకాంత్ సినిమాలకు క్రేజ్ తగ్గింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అవి నిజమే అన్నట్లుగా అన్నాత్తే సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు లో అన్నాత్తేను అదే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
అన్నాత్తే సినిమాకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. కాని తెలుగు లో మాత్రం అన్నాత్తే గురించిన బజ్ భారీ రేంజ్ లో కనిపించడం లేదు. అయినా కూడా ఈ స్థాయిలో రేటు పలకడం గొప్ప విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ వర్క్ జరుగుతోంది. ఇదే సమయంలో అన్నాత్తే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు లో ఈ సినిమాను టాలీవుడ్ లో పెద్ద సినిమాల రేంజ్ లో విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాతో పాటు తెలుగు నుండి మరి కొన్ని చిన్న సినిమాలు కూడా అదే వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వాటితో అన్నాత్తే సినిమా పోటీ పడాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో థియేటర్ల వ్యవస్థ చాలా నష్టాల పాలు అయ్యింది. బయ్యర్లు కూడా గతంలో మాదిరిగా భారీ మొత్తాన్ని పెట్టి సినిమాలను కొనుగోలు చేసేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారు. అలాంటి అన్నాత్తే సినిమాను ఈ మొత్తంకు కొనుగోలు చేయడం సినిమాపై బయ్యర్లకు చాలా నమ్మకం అంటున్నారు. కీర్తి సురేష్.. నయన్ ఇంకా ప్రముఖులు అన్నాత్తేలో నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.