కరోనా తర్వాత బాలీవుడ్ పట్టుమని కనీసం పది సక్సెస్ లను కూడా అందుకోలేక పోయింది. దేశ వ్యాప్తంగా హిందీ సినిమాకు మార్కెట్ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు పదుల దేశాల్లో విడుదల అయ్యి వందల కోట్ల రాబట్టిన దాఖలాలు ఉన్నాయి. అందంతా కరోనా కు ముందు... కరోనా తర్వాత మొత్తం సీన్ మారింది. సౌత్ సినిమాలు వందల కోట్లు వసూళ్లు రాబడుతూ ఉంటే బాలీవుడ్ సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి.
గత రెండున్నర సంవత్సరాల కాలంలో బాలీవుడ్ నుండి థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల్లో భారీ బ్లాక్ బస్టర్ కమర్షియల్ విజయాలు సాధించిన సినిమాలే కనిపించడం లేదు. ఒకటి రెండు మీడియం రేంజ్ విజయాలను సొంతం చేసుకున్నా అవి కూడా సౌత్ సినిమాల ముందు చిన్నబోయాయి. కేజీఎఫ్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా లు వేయి కోట్లు అంతకు మించి వసూళ్లు చేయగా పుష్ప.. విక్రమ్ వంటి సినిమాలు మూడు నాలుగు వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి.
ఇంకా పలు సౌత్ సినిమాలు వందల కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ 3 వంటి మీడియం రేంజ్ సినిమా కూడా వంద కోట్లకు పైగా నే వసూళ్లు రాబట్టింది.
కాని బాలీవుడ్ లో మాత్రం వంద కోట్లు అనేది అందని ద్రాక్ష మాదిరిగా అయ్యింది. గత వారం లో వచ్చిన జగ్ జగ్ జియో సినిమా మరియు భూల్ భులయ్య సినిమాలు ఒక మోస్తరుగా ఆకట్టుకున్నాయి. ఓపెనింగ్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. కాని లాంగ్ రన్ లో మాత్రం వసూళ్లు నమోదు అవ్వలేదు.
ఆ సినిమా లు బాలీవుడ్ బాక్సాఫీస్ సందడిని తిరిగి తీసుకు వస్తాయి... ఇక నుండి బాలీవుడ్ జోరు మామూలుగా ఉండదు అనుకున్నారు. కాని మొత్తం రివర్స్ అయ్యింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆధిత్య రాయ్ కపూర్ ఓమ్ సినిమా బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడింది. అంతే కాకుండా హిందీ లో వచ్చిన మాధవన్ రాకెట్రీ సినిమా కూడా వసూళ్ళ పరంగా నిరాశ పరిచింది. జగ్ జగ్ జియో బాక్సాఫీస్ సందడి మూడు నాళ్ల ముచ్చటగా మారిందని బాక్సాఫీస్ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. వచ్చే వారం పరిస్థితి మారుతుంది... ఆ తర్వాత వారం పరిస్థితిలో మార్పు వస్తుంది అన్నట్లుగా ఎదురు చూస్తున్న హిందీ ఫిల్మ్ మేకర్స్ కు ఈ వారం కూడా డిజాస్టర్ వీక్ అనే విషయం మింగుడు పడటం లేదు. హిందీ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వచ్చేది ఎప్పుడు.. బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడేది ఎప్పుడు.