కరోనా మహమ్మారి బారినపడి మరో సెలెబ్రిటీ మృతిచెందారు. బ్రిటన్‌కు చెందిన సైకాలజిస్టు, హాలీవుడ్ నటి హిల్లీరీ హీత్ (74) ఇటీవల కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆమె మనుమడు అలెక్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే హాలీవుడ్ ప్రముఖులు శనివారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. హిల్లరీ ముఖేల్ రీవ్స్ హార్రర్ చిత్రం విచ్ ఫైండర్‌తో సినీరంగ ప్రవేశం చేశారు. కాగా బ్రిటిష్ కి చెందిన హిల్లరీ ముఖేష్ రివ్స్ చిత్రం 'విచ్ ఫైండర్ జనరల్'తో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి లక్షలాది అభిమానుల మెప్పును పొందింది. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
నిర్మాతగా నటిగా హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించిన హిల్లరీ మృతికి చాలా మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. హిల్లరీ 1960, 1970 దశకాల్లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 1990ల్లో ఆమె సినిమా నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. నిల్ బై మౌత్, యాన్ ఆవ్‌ఫుల్లీ అడ్వెంచర్ వంటి చిత్రాలకు నిర్మాతగా పరిచయమై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సినిమా రంగంలోకి రాకముందు హిల్లరీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత వివిధ ఆస్పత్రుల్లో అడిక్షన్ కౌన్సెలర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం సినిమా రంగంలోకి అడుగుపెట్టి హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడి హిల్లరీ మృతి చెందడం పట్ల అక్కడి హాలీవుడ్ ఇండస్ట్రీలో విచార ఛాయలు పులుముకున్నాయి. నెటిజన్లు అంతా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు