భారీ ప్రాజెక్ట్ లలో అప్పుడప్పుడు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి.. క్రియేటివ్ ఈగో క్లాషెష్ వస్తుంటాయి. ఇక టాప్ టెక్నీషియన్స్ కి, ప్రొడ్యూసర్లకి కూడా అదే తరహాలో ఈగో క్లాషెస్ రావడం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. `ఆచార్య` సినిమాకు కెమెరామెన్ లు, ఇతర టెక్నీషియన్ లు మధ్యలో మారిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అంతే కాకుండా కారవ్యాన్ ల వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఇప్పడు ఇదే తంతు మరో మెగా హీరో సినిమా విషయంలోనూ జరుగుతోంది. ఇదే ఇప్పడు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోంది. వివరాల్లోకి వెళితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `RRR` తరువాత దిగ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే కీలక ఘట్టాల షూటింగ్ ని పూర్తి చేశారు. రాజమండ్ర, అమృత్ సర్, హైదరాబాద్ లో చిత్రీకరించిన పలు కీలక షెడ్యూల్స్ తో ఈ మూవీ కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.
విచిత్రం ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ ఒక్కొక్కరుగా ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోతుండటం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ నుంచి ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ తప్పుకున్నాడు. అయితే ఆయనని ఏవోవో కారణాలు చెప్పి ప్రొడక్షన్ హౌస్ అంటే దిల్ రాజు తొలగించినట్టుగా వార్తలు వినిపించాయి. ఆయన స్థానంలో రవీందర్ రెడ్డిని తీసుకున్నారు. కానీ తాజాగా ఆయన కూడా షాకిచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ మూవీ కోసం యూనివర్సిటీ సెట్ ని ప్లాన్ చేశారట. ఈ సెట్ కి సంబంధించిన సెట్ వర్క్ సమయంలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డికి, నిర్మాత దిల్ రాజుకు మధ్య క్రియేటివిటీకి సంబంధించిన అభిప్రాయ బేధాలు వచ్చాయట. దీంతో రవీందర్ రెడ్డి ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టుగా చెబుతున్నారు. ముందు నుంచి క్వాలిటీ విషయంలో రాజీపడటం రవీందర్ రెడ్డికి తెలియదు. అదే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలకు కారణంగా నిలిచినట్టుగా చెబుతున్నారు.
ఇప్పటికే `ఇండియన్ 2` రీ స్టార్ట్ కోసం RC 15 షూటింగ్ ని దర్శకుడు శంకర్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కంగారు పడుతున్న ఫ్యాన్స్ కు తాజాగా టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోతుండటం మరింతగా టెన్షన్ కు గురిచేస్తోందట.