నేచురల్ స్టార్ నాని మరియు నజ్రియా నజీమ్ ఫహాద్ జంటగా నటించిన తాజా చిత్రం ''అంటే.. సుందరానికీ!". వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయింది.
'అంటే సుందరానికీ' సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. బోర్డు సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ 'యూ' (U) సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో అన్ని ఏజ్ గ్రూప్ ఆడియన్స్ ఈ సినిమాని ఆస్వాదించడానికి వీలు కలుగుతుంది.
అయితే నాని 28వ సినిమా రన్ టైం 2 గంటల 56 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే 'అంటే సుందరానికీ' మూవీ దాదాపు 3 గంటల సేపు ఉండబోతోంది. ఒక రోమ్ కామ్ జోనర్ చిత్రానికి ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. మరి మూడు గంటలసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టి ఏవిధంగా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.
ఇప్పటి వరకు విడుదలైన 'అంటే సుందరానికీ' ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్ కు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. సుందర్ ప్రసాద్ అనే బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని కనిపించగా.. క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నటించింది.
సుందర్ మరియు లీలా మధ్య విలక్షణమైన ప్రేమకథకు ట్రైలర్ లో ప్రెజెంట్ చేశారు. చాలా రోజుల తర్వాత నాని పూర్తి స్థాయిలో నవ్వించే పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. నజ్రియా నజీమ్ డెబ్యూతోనే తెలుగులో ప్రభావం చూపేలా కనిపించింది.
ఇందులో సీనియర్ నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్ష వర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ నిర్మించిన 'అంటే.. సుందరానికీ' చిత్రాన్ని జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. తమిళ్ లో ‘అడాడే.. సుందరా’ - మలయాళంలో ‘ఆహా.. సుందరా’ అనే పేర్లతో ఈ సినిమా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు.. పలు ఈవెంట్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మరి 'అంటే సుందరానికీ' సినిమాతో ఈ ఆవకాయ్ సీజన్ ని సక్సెస్ ఫుల్ గా ముగిస్తారో లేదో చూడాలి.