నేచురల్ స్టార్ నాని ఎంతో ఇష్టంగా చేసిన 'అంటే సుందరానికి' సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తానికి నష్టాలను మిగిల్చింది. చాలా కాలంగా నాని నుంచి ఒక ఫుల్ కమర్షియల్ కామెడీ సినిమా కోరుకున్న ఆడియన్స్ కి చాలా వరకు సినిమా నచ్చినప్పటికి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు రాకపోవడం విశేషం. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు గా తెలుస్తోంది. నిర్మాతలు అయితే సేఫ్ జోన్ లోనే పడ్డారు.
కానీ పంపిణీదారులకు మాత్రం సినిమా గట్టిగా ని దెబ్బ కొట్టింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి బడ్జెట్ కారణాలు అని తెలుస్తోంది. అనవసరంగా ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మాతలు లాభాలు లేకుండా చేసుకున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఓటీటీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా డిజిటల్ ప్రపంచంలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం భాషల్లో కూడా అంటే.. సుందరానికి సినిమాను విడుదల చేయడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ ఈ రోజు నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాని టైమింగ్ కామెడీ అయితే ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక మొదటి సారి ఈ సినిమాతో నజ్రియా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అంటే సుందరనికి సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర నిర్మాతలు భారీ స్థాయిలో విడుదల చేశారు. కానీ అందుకు భిన్నంగా సినిమా నెగిటివ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ రూట్లో నిర్మాతకు మంచి లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఇప్పుడే నష్టాల నుంచి కోలుకుంటున్న నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది చూడాలి.