ఇలాగైతే కష్టమే బాసూ!!

Update: 2017-03-25 11:23 GMT
నిన్న రిలీజైన కాటమరాయుడు సినిమా గురించి చాలామంది చేసిన కామెంట్ ఒక్కటే. అనూప్ రూబెన్స్ అందించిన సాంగ్స్ కానివ్వండి.. అలాగే ఆయన అందించిన రీ రికార్డింగ్ కాని చాలా డిజప్పాయింటింగ్ గా ఉన్నాయ్ అంటున్నారు. అందుకే ఇప్పుడు జనాలు మరోసారి మణిశర్మ అండ్ థమన్ ల గురించి మాట్లాడుకుంటున్నారు. పదండి చూద్దాం.

నిజానికి సినిమాలోని పాటలు ఎలా ఉన్నా కూడా.. ఫైట్లు లేదా ఎమోషనల్ సీన్లు నిలబడాలంటే మాత్రం.. రీ రికార్డింగ్ అద్భుతంగా ఉండాలి. ఒక ప్రక్కన పాటలను కూడా బాగా కొట్టి.. రీ రికార్డింగ్ కూడా అదరగొట్టేశే మ్యూజిక్ డైరక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఫస్టుంటాడు. ఇక దేవీని పక్కనెట్టేస్తే.. కేవలం ఆర్.ఆర్. చితక్కొట్టేశే బ్యాచులో.. థమన్ అండ మణిశర్మ ముందుంటారు. అందుకే పాటలు ఎవరితో కొట్టించుకున్నా కూడా ఈమధ్యన చాలామంది స్టార్ డైరక్టర్లు హీరోలు ఆర్ ఆర్ కోసం మణిశర్మను రంగంలోకి దించేస్తున్నారు. సీతమ్మవాకిట్లో వంటి సినిమాకు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ వాడ్డానికి అదే కారణం. అలాగే థమన్ కూడా సరైనోడు సినిమాలో సింపుల్ ఇంటర్వెల్ బ్యాంగ్ ను తన ఆసక్తికరమైన బ్యాగ్రౌండ్ మ్యజిక్ తో మతిపోగొట్టేశాడు. సౌండ్ మిక్సింగ్ నుండి డాల్బీ కన్వర్షన్ వరకు.. థమన్ అరిపించాడంతే. కాని కాటమరాయుడు ఫైట్స్ అండ్ సీన్స్ లో అటువంటి రికార్డింగ్ మిస్సయ్యింది.

అసలు తన సీనియర్లు అటువంటి కీలకమైన సీన్లకు ఎటువంటి ఆర్ ఆర్ అందిస్తున్నారో బహుశా అనూప్ రూబెన్స్ ఏమైనా రీసెర్చ్ చేసుకుంటే బెటరేమో. లేకపోతే పెద్ద హీరోల సినిమాలు ఇక మీద పడటం కాస్త కష్టమే అవుతుంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News