టాలీవుడ్ లో మలయాళీ భామల సందడి బాగా నడుస్తోంది. క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు తెగ పట్టేస్తున్నారు కేరళ కుట్టీలు. తెలుగు సినిమాల్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న అనుపమా పరమేశ్వరన్.. ఇప్పుడో ఏకంగా చెర్రీ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.
తెలుగులో త్రివిక్రమ్ మూవీ అ..ఆ..తో పరిచయమైన అనుపమ.. ఆ వెంటనే ప్రేమమ్ తో మరో హిట్ కొట్టేసింది. ఇప్పుడు సంక్రాంతికి శతమానం భవతి చిత్రంలో కూడా శర్వానంద్ కి హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో నటిస్తున్న విషయాన్ని అధికారికంగా కన్ఫాం చేసేసింది. అభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పిన ఈ సుందరి.. మెగా ప్రాజెక్టుకు సైన్ చేశానని.. సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్నట్లు అనౌన్స్ చేసేసింది. రత్నవేలు లాంటి ట్యాలెంటెడ్ టెక్నీషియన్ తో వర్క్ చేసే ఛాన్స్ రావడంపై తెగ హ్యాపీ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్.
ఈ నెలాఖరులో కానీ.. వచ్చే నెల ప్రారంభంలో కానీ సుకుమార్-చెర్రీల మూవీ అధికారికంగా ప్రారంభం కానుంది. నిజానికి.. ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్లనే ఆడిషన్ చేశారు కానీ.. పక్కా పల్లెటూరి అమ్మాయి లుక్ లో ఒదిగిపోయేందుకు విపరీతంగా హీరోయిన్లను జల్లెడ పట్టేశాడు దర్శకుడు సుకుమార్. చివరకు ఆ సెర్చింగ్ అనుపమ దగ్గర ఆగిందన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/