మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక్కో పదాన్ని ఎంతో జాగ్రత్తగా వాడుతూ ఉంటాడు. అ..ఆ.. చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ని అమ్మోరు కత్తి అని పిలిపిస్తాడు. కత్తిలాంటి ఫిగర్ కంటే బాగా పదునుగా ఉండడంతోనే.. ఇలా అనిపించాడని ఇట్టే అర్ధమవుతోంది. మరి త్రివిక్రమ్ అన్నాడనో.. పేరు నిలబెట్టుకోవాలనో తెలీదు కానీ.. ఈ భామ అంతకంటే స్పీడ్ నే చూపిస్తోంది.
ఏళ్లకు ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నా.. ఒక్క ముక్క తెలుగురాని హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ అనుపమ మాత్రం తొలి సినిమాతోనే డబ్బింగ్ చెప్పేసుకునేంతగా తెలుగు నేర్చేసుకుంది. తక్కువ మాటలే కదా.. చెప్పేసెయ్ అని త్రివిక్రమ్ ధైర్యం చెప్పడంతోనే ట్రై చేశానని చెబుతోంది. అసలు టాలీవుడ్ కి వచ్చే ముందే తెలుగు నేర్చుకుని మరీ వచ్చానని చెబుతోంది ఈ మలయాళీ అందం. అయితే.. అ..ఆ..లో గడుసు పిల్లగా కనిపించినా.. రియల్ లైఫ్ లో మాత్రం నేను బాగా సున్నితం బాబూ అంటోంది అనుపమ.
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అంటే బాగా ఇష్టం అన్న అనుపమ.. పవన్ తో తొలిసారి కలిసినపుడు మాట్లాడిన అనుభూతులు మర్చిపోలేదట. ఆయన వినయం బాగా ఆకట్టుకుందని అంటోంది. ఇక ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ల డ్యాన్సులకైతే వీరాభిమానిని అని కూడా చెబుతోంది. నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న ప్రేమమ్ తో టాలీవుడ్ లో తనకు మరో విజయం ఖాయమని ధీమాగా ఉంది అనుపమా పరమేశ్వరన్.