ఆర్తీలా చేయొద్దు.. జాగ్ర‌త్త‌గా ఉండు!

Update: 2015-11-10 11:30 GMT
వెయిట్ రిడ‌క్ష‌న్ .. ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలు అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తి. అయితే బ‌రువు త‌గ్గేందుకు ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులు. శ‌రీర‌త‌త్వాన్ని బ‌ట్టి అది శ‌స్ర్త చికిత్స ద్వారా త‌గ్గించుకోవాలా?  లేక సుదీర్ఘ కాలం జిమ్ముల్లో కుస్తీలు ప‌ట్టి త‌గ్గించుకోవాలా? అన్న‌ది డాక్ట‌ర్లు నిర్ణ‌యిస్తారు. కొంద‌రు రూల్స్‌ని అతిక్ర‌మించి షార్ట్ క‌ట్‌ లో బ‌రువు త‌గ్గించుకునేందుకు ప్ర‌యత్నించి ప్ర‌మాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు. లైపో స‌క్సెమీ లాంటి చికిత్స‌లు లాంగ్ ర‌న్‌ లో ఎన్నో రుగ్మ‌త‌ల‌కు దారి తీయ‌డం,  ఒక్కోసారి ప్రాణాల మీదికి తెచ్చుకోవ‌డం జ‌రుగుతోంది. ఇటీవ‌లి కాలంలో ఆర్తి అగ‌ర్వాల్ ఇదే ప‌ద్ధ‌తిలో బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నించి అంద‌ని లోకాల‌కు వెళ్లిపోయింది. అందుకే బ‌రువు త‌గ్గాలంటే ముందుగా డాక్ట‌ర్ల సల‌హా త‌ప్ప‌నిస‌రి. వ‌య‌సును బ‌ట్టి ఏం చేస్తే స‌హ‌జ‌సిద్ధంగా బ‌రువు త‌గ్గొచ్చో డాక్ట‌ర్లు చెబుతున్నారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే స్వీటీ అనుష్క ఇప్పుడు వెయిట్  ప్రాబ్లెమ్‌ ని ఫేస్ చేస్తోంది. ఇది బాహుబ‌లి 2కి పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పుడున్న సిట్యుయేష‌న్‌ లో ఈ సినిమా కేవ‌లం అనుష్క వ‌ల్ల‌నే వాయిదా వేయాల్సి వ‌చ్చింది అంటే అర్థం చేసుకోండి!
            
స్వీటీ న‌టించిన సైజ్ జీరో .. ప్రయోగం బాహుబ‌లికి కొంత ముప్పు తెచ్చింది. సైజ్ జీరో సినిమా కోసం స్వీటీ ఏకంగా 20 కేజీల బ‌రువు పెరిగింది. బ‌రువు పెర‌గ‌డం అయితే స‌హ‌జంగా సాధ్య‌మైంది కానీ, ఇప్పుడు అది త‌గ్గ‌డం అనేది అంత ఈజీగా కుద‌ర‌డం లేదు. ఎంత తిండి మానేసినా వెయిట్‌ ని కంట్రోల్ చేయ‌డం అంత వీజీగా లేదు. అందుకే త్వ‌ర‌లో శ‌స్ర్త చికిత్స‌కు రెడీ అవుతోంద‌ని చెబుతున్నారు. అయితే ఇలాంటి ఆర్టిఫిషియ‌ల్ ప‌ద్ధ‌తుల్ని అనుస‌రిస్తే అది ప్రాణాంత‌కం అని అనుష్క‌ను హెచ్చ‌రించారు డాక్ట‌ర్లు.
             
34 వ‌య‌సులో ఇలాంటి ఆర్టిఫిషియ‌ల్ ప‌ద్ధ‌తుల కంటే స‌హ‌జ‌సిద్ధంగా వ్యాయ‌మం చేసి త‌గ్గించుకోవ‌డ‌మే క‌రెక్ట్ అని డాక్ట‌ర్లు సీరియ‌స్‌ గా ఎడ్వ‌యిజ్ చేశారు. అంటే మ‌రో రెండు నెల‌ల పాటు స్వీటీ తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేస్తేనే స‌మ‌స్య‌ను వ‌దిలించుకోగ‌ల‌దు. అంటే అంత‌వ‌ర‌కూ బాహుబ‌లి -2 సెట్స్‌ కెళ్ల‌డం కుద‌ర‌ద‌న్న‌మాట‌! బాప్ రే.. ఎంత స‌మ‌స్య వ‌చ్చింది. అన్న‌ట్టు సైజ్ జీరో త్వ‌ర‌లోనే రిలీజ్‌ కి వ‌స్తోంది.
Tags:    

Similar News