మొత్తానికి పండుగ విజయంగా నాగార్జున సోగ్గాడే చిన్నినాయన చిత్రం నిలిచింది. గతంలో సీతమ్మ వాకిట్లో చిత్రాన్ని నాయక్ అధిగమిస్తే పండక్కి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ నిలవలేవు అన్న వాదనని సోగ్గాడు తప్పని రుజువుచేసింది. ఈ తరం ప్రేక్షకులకు నాగార్జున ఎందుకు మన్మధుడిగా కీర్తింపబడతాడో రుజువు చేసింది.
బంగార్రాజు - సత్యభామ - రామూ - సంపత్ ఇలా ప్రతీ పాత్రని చక్కగా తీర్చిదిద్దిన దర్శకుడు మాత్రం కృష్ణకుమారి(అనుష్క) పాత్రను ఎందుకు ఇమిడ్చాడో అర్ధమవ్వదు. బంగార్రాజుది - కృష్ణకుమారిది ఎటువంటి సంబంధమో స్పష్టత ఇవ్వడు. ఒకవేళ ఇద్దామనుకున్నా అది మంచి ఉద్దేశం అయ్యుండదు. ఇన్ని కాంప్లికేషన్ల మధ్య ఈ క్యారక్టర్ ని డిజైన్ చెయ్యడం, దాన్ని అనుష్క చేత ఒప్పించడం అర్ధం లేని వ్యవహారంగా నిలిచింది.
పోనీ అనుష్క సైతం ఆ పాత్రకి న్యాయం చెయ్యకపోవడం బాధాకరం. సైజ్ జీరో సమయంలో బొద్దుగా వున్న అనుష్కచేత రెండు రోజుల కాల్ షీట్లతో బండి లాగించేసినట్టు తెలుస్తుంది. ఈ ఒక్క పాత్ర మినహా సినిమా అంతా క్లీన్ కంటెంట్ తో నడవడం గమనార్హం.