కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `అపరిచితుడు` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు గతేడాది స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ హీరోగా...కియారా అద్వానీ హీరోయిన్ గా చిత్రాన్ని బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. స్ర్కిప్ట్ పనులు కూడా పూర్తిచేసి ప్రారంభిద్దాం అన్నకున్న సమయంలోనే శంకర్ కి ఎదురు దెబ్బ తగిలింది.
ఆ సినిమా మాతృక నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ సినిమా హక్కులు తనవని...శంకర్ ఎలా? రీమేక్ చేస్తారని షాక్ ఇచ్చారు. చ్టబద్దంగా శంకర్ కి నోటీసులు జారీ చేసారు. దీంతో ప్రాజెక్ట్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. సర్వం సిద్దమైన తర్వాత శంకర్ కి ఊహించని షాక్ లా తగిలింది. మరోవైపు `ఇండియన్ -2` మధ్యలో ఆగిపోవడం...ఇటు రీమేక్ కి అడ్డంకులతో శంకర్ బాగా డిస్టర్బ్ అయ్యారు.
దీంతో వీళ్లతో లాభం లేదనుకున్న శంకర్ ఆ సమయంలోనే రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించి అటు కోలీవుడ్ కి ...ఇటు రణవీర్ సింగ్ కి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్ సీ 15 తో శంకర్ బిజీ అవ్వడంతో అపరిచితుడు రీమేక్ కి పూర్తిగా బ్రేక్ పడింది. లీగల్ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదని శంకర్ కూడా లైట్ తీసుకున్నారు. అటు రణవీర్ సింగ్ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బీజ అవ్వడంతో అపరిచితుడు ఇక అటకెక్కినట్లేనని అంతా నిర్దారణకి వచ్చేసారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదని తాజాగా వెలుగులోకి వస్తోంది.
`అపరిచితుడు` హిందీ రీమేక్ పట్టాలెక్కే దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. కోర్టులో తేలే వ్యవహారం కాదని శంకర్-రణవీర్ సింగ్-ఆస్కార్ రవిచంద్రన్ ముగ్గురు ఇటీవలే ఓ మాటకి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమచారం. రవిచంద్రన్ వాదనని ఏమాత్రం తప్పుబట్టకుండా రైట్స్ కోసం కొంత మొత్తం శంకర్ -రణవీర్ ద్వయం చెల్లించి దక్కించుకున్నట్లు వినిపిస్తుంది.
అయితే ఈ విషయంలో ఎక్కువ శ్రద్ద తీసుకుంది హీరో రణవీర్ అని అంటున్నారు. ఆయనే కావాలని పట్టుబట్టి ప్రాజెక్ట్ ని ముందుకు తీసు కెళ్లాలని శంకర్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ విషయాన్ని ఇంత దూరం తీసుకొచ్చినట్లు భోగొట్టా. ఇలాంటి కంటెంట్ ఉన్న మంచి సినిమా వదులుకుంటే? నష్టం తమకేనన్న అభిప్రాయంతో శంకర్ ని వెంటపెట్టుకుని దీనికొక పరిష్కారం కుదిరేలా చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే గనుక నిజమైతే `అపరిచితుడు` రీమేక్ పట్టాలెక్కడం ఖాయమే. ప్రస్తుతం శంకర్ చరణ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ 70 శాతం పూర్తయిందంటున్నారు. బ్యాలెన్స్ పూర్తిచేసి `ఇండియన్ -2` పెండింగ్ పనులు మొదలు పెడతారు. అటుపై `అపరిచుతుడు` హిందీ రీమేక్ సంగతి చూసే ఛాన్స్ ఉంది.