ఫ‌త్వాపై స్పందించిన ఏ.ఆర్‌.రెహ‌మాన్

Update: 2015-09-15 11:30 GMT
ఆస్కార్ అందుకున్న త‌ర్వాత మ‌ళ్లీ ఇంత కాలానికి రెహ‌మాన్ పేరు ప్ర‌పంచం మొత్తం మార్మోగిపోయింది. మ‌రోసారి ఆస్కార్ అందుకున్నంత పాపులారిటీ వ‌చ్చింది. అయితే ఈసారి ఓ ముస్లిమ్ తెగ జారీ చేసిన ఫ‌త్వా ఇంత ప‌నిచేసింది. ముంబైకి చెందిన సున్నీ తెగ రాజా అకాడెమీ ఈ ఫ‌త్వాని జారీ చేసి రెహ‌మాన్‌ని చిక్కుల్లో ప‌డేసింది.

దేవుడిని అవ‌మానిస్తే ఎంత‌టివారినైనా వ‌దిలిపెట్టం అని రాజా అకాడెమీ ప్ర‌క‌టించింది. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ పై తీస్తున్న మ‌హమ్మ‌ద్‌:  ది మెసెంజ‌ర్ ఆఫ్ గాడ్ చిత్రానికి సంగీతం అందించినందుకు రెహ‌మాన్‌కి ఈ చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ఈ ఫ‌త్వా దెబ్బ‌కి రెహ‌మాన్ కొన్ని కీల‌క‌మైన ప్రోగ్రామ్‌ లు కూడా చిక్కుల్లో ప‌డ్డాయి. త్వ‌ర‌లో తాజ్‌ మ‌హ‌ల్ ద‌గ్గ‌ర చేయాల్సిన లైవ్ కాన్సెర్ట్ సైతం ఆపేయాలంటూ ఏఎస్ ఐ ఏ.ఆర్‌.రెహ‌మాన్‌ ని కోరారు. అంటే ఒక్క ఫ‌త్వా ఎంత బ‌లంగా ప‌నిచేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

కార‌ణం ఏదైనా రెహ‌మాన్ స‌ద‌రు సంస్థ  విధించిన ఫ‌త్వా రెహ‌మాన్‌ ని ఎంతో వేధించింద‌న్న‌ది నిజం. దీనికి స్పందిస్తూ బ‌హిరంగంగా స‌మాధానం చెప్పాల్సి వ‌చ్చింది. నేను ఈ సినిమాకి నిర్మాత‌ను కాను. మాజిది నిర్మాత‌. కేవ‌లం నేను సంగీత ద‌ర్శ‌కుడిని మాత్ర‌మే. నేను మ‌ధ్యేవాదిని మాత్ర‌మేన‌ని రెహ‌మాన్ గొంతెత్తాడు. ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌లేద‌ని ప‌రోక్షంగా చెప్పాడు. నేనేమీ ఇస్లామ్‌ కి స్కాల‌ర్‌ ని కాను. మ‌ధ్య‌స్థ మార్గాన్నే అన్వేషించాను. ఈ ట్రెడిష‌న్ లో నేనూ భాగ‌మే. తూర్పు, ప‌డ‌మ‌ర‌ల్లో అన్నిచో్ట్లా నేను జీవించాను. ప్ర‌తిచోటా నేను ప్ర‌జ‌ల్ని అర్థం చేసుకుని ప్రేమించాను. అందుకే నేను మ‌ధ్య‌స్థ మార్గాన్ని ఎంచుకున్నా.. అని రెహ‌మాన్ చెప్పారు.

మ‌రి సున్నీ సంస్థ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి. రెహ‌మాన్ వ్య‌క్తిగ‌తంగా రిలీజ్ చేసిన ఓపెన్ లెట‌ర్‌ ని ఇప్ప‌టికే 30వేల మంది చ‌దివారు. 2800 మంది షేర్ చేసుకున్నారు. అదీ సంగ‌తి.
Tags:    

Similar News