ఏఆర్ రెహమాన్ కూతురిపై రచయిత్రి సెన్సేషనల్ కామెంట్స్..

Update: 2020-02-16 16:48 GMT
ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ పై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బుర్ఖా వేసుకున్న ఖతీజా రెహమాన్ ని చూస్తే తనకు ఊపిరాడటం లేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేసింది. ఆమె చేసిన ఈ కామెంట్ పై వెంటనే తిరిగి కౌంటర్ వేసింది రెహమాన్ కూతురు ఖతీజా. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.

సాంద్రాయిక కుటుంబంలోని చదువుకున్న మహిళలు కూడా బ్రెయిన్ వాష్‌కు గురికావడం విచారం కలిగిస్తోందని తన సందేశంలో పేర్కొంది తస్లీమా నస్రీన్. ఈ మేరకు ఏఆర్ రెహ్మాన్ తీరును సైతం తప్పుబట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే తనకు చాలా ఇష్టమని - అయితే ఆయన కూతురిని చూసిన ప్రతిసారీ తనకు ఊపిరాడటం లేదని తెలిపింది. అయితే ఆమె చేసిన ఈ కామెంట్స్ చూసి అదే సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ వేసింది ఖతీజా రెహమాన్.

ఏడాది కాలంగా ఈ వివాదం ఇలాగే కొనసాగుతోందని పేర్కొంటూనే.. దేశంలో చాలా జరుగుతున్నా వాటన్నింటినీ వదిలి ప్రజలు ఓ మహిళ ఏ దుస్తులు వేసుకోవాలన్న అంశంపై ఆందోళన చెందుతుండటం తనకు ఆశ్చర్యంగా అనిపిస్తోందని తెలిపింది ఖతీజా రెహమాన్. ఈ టాపిక్ చర్చకు వచ్చినప్పుడల్లా తనలో కట్టలుతెంచుకునే ఆవేశం రగులుతోందని, అయినా తాను బుర్ఖా వేసుకోవడం తన సొంత విషయమని, తన మౌనాన్ని అజ్ఞానంగా భావించొద్దని సందేశమిచ్చింది. తన జీవితం పట్ల తాను సంతోషంగా, గర్వంగా ఉన్నానని ఆమె చెప్పింది.

ఇలా ఊపిరి ఆడట్లేదని భావిస్తున్న వాళ్లంతా బయటకెళ్లి కాస్త స్వఛ్చమైన గాలి పీల్చుకోవాలని కౌంటర్ వేసింది ఖతీజా రెహమాన్. స్త్రీవాదం అంటే ఏంటో గూగుల్‌లో వెతికి తెలుసుకో అని, తండ్రులను వివాదంలోకి తీసుకొచ్చి ఇలా మహిళలను కించపరచడం స్త్రీవాదం కాదని తెలుపుతూ రచయిత్రి తస్లీమా నస్రీన్ పై ఘాటుగా విరుచుకుపడింది ఖతీజా. 

   

Tags:    

Similar News