నిన్నటి తరం ప్రేక్షకులకు అరవింద్ స్వామి ఎవరంటే వెంటనే గుర్తొచ్చే సినిమాలు రోజా-బొంబాయి. వాటితో అతను మెస్మరైజ్ చేసిన తీరు ఇప్పటికీ మర్చిపోవడం కష్టమే. కాని ఇప్పటి జెనరేషన్ కు మాత్రం ఇతను ధృవ విలన్ గానే సుపరిచితుడు. కోల్డ్ విలనీని చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో పలికించిన తీరు తమిళ్ తెలుగు సినిమా లవర్స్ ని ఫిదా చేసింది. అప్పటినుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం హీరోగా ఫుల్ బిజీ అయిపోయిన అరవింద స్వామి త్వరలో రూపొందబోయే జయలలిత బయోపిక్ లో సుప్రసిద్ధ నటులు తమిళనాడు మాజీ సిఎం ఎంజిఆర్ పాత్ర పోషించనున్నట్టు చెన్నై మీడియా టాక్.
ఇప్పటికే దర్శకుడు విజయ్ అరవింద్ ను కలిసి రెండు మూడు నేరేషన్లు ఇచ్చాడట. చాలా కీలకమైన మరియు సున్నితమైన పాత్ర కాబట్టి అలోచించి చెప్తానని అరవింద స్వామి చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే అరవింద స్వామికి జాక్ పాట్ తగిలినట్టే. కంగనా రౌనత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ బయోపిక్ ని విజయ్ ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలో మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన ఇద్దరులో ఎంజిఆర్ పాత్రను మోహన్ లాల్ చేయగా కరుణానిధిగా ప్రకాష్ రాజ్ జయలలితను పోలిన పాత్రలను ఐశ్వర్య రాయ్ చేశారు. కాని సినిమాను జనరంజకంగా మలచడంలో మణిరత్నం ఫెయిల్ అవ్వడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. మరి విజయ్ ఈ సవాల్ ని ఎలా తీసుకుంటాడో చూడాలి. క్యారెక్టర్స్ అన్ని ఫైనల్ అయ్యాక షూటింగ్ కు వెళ్ళే అవకాశం ఉంది.