నా బాయ్ ఫ్రెండ్ అతనే: అర్చన

Update: 2018-01-31 12:00 GMT
 టైం కలిసి రాకపోతే ఎన్ని సినిమాలు చేసినా కోరుకున్న పేరు కొందరికి రాదు. హీరొయిన్ అర్చనకు ఇది బాగా వర్తిస్తుంది. కెరీర్ ప్రారంభంలో వేదా పేరుతో తపన సినిమాతో పరిచయమైన అర్చన అల్లరి నరేష్ నేను మూవీతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలైతే చేసింది కాని అవేవి లీడ్ హీరొయిన్ గా అవకాశాలు ఇచ్చినవి కాకపోవడంతో కెరీర్ చాలా స్లోగా నడిచింది. ఈ మధ్య వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మళ్ళి లైం లైట్ లోకి వచ్చిన అర్చన ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తోంది కాని అవేవి పెద్ద బ్రేక్ ఇచ్చేవి అయితే కాదు. ఇటీవలే ఓ ఛానల్ లో స్టార్ కమెడియన్ ఆలి నిర్వహించే చాట్ షోలో పాల్గొన్న అర్చన తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పెసింది.

అతని పేరు తనయ్. తనకు వ్యక్తిగతంగా గతంలో వేరే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని  ఇన్ డైరెక్ట్ గా  ఒప్పుకున్న అర్చన ప్రస్తుతమున్న బాయ్ ఫ్రెండ్ చాలా చాలా ఇష్టమని చెప్పడం కొసమెరుపు. గతంలో ఓ ప్రముఖ యు ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీలో ఎదుర్కున్న ఇబ్బందులు, అవమానాల గురించి ఓపెన్ గానే చెప్పిన అర్చన ఇప్పుడు కూడా మొహమాటం లేకుండా తన మనసులో మాటలను షేర్ చేసుకుంది. తనయ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. స్వతహాగా  కూచిపూడి డాన్సర్ అయిన అర్చన విదేశాల్లో ఇప్పటి దాకా చాలా ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగు అమ్మాయి కావడం వల్ల కాబోలు తనకు అవకాశాలు రావడం లేదేమో అని చెప్పే అర్చన పూర్తి పేరు అర్చనా శాస్త్రి. బ్రాహ్మల కుటుంబానికి చెందిన అర్చన ఇన్ని సినిమాలు చేసి పేరు తెచ్చుకోవడం విశేషమే.
Tags:    

Similar News