హోటల్లో సైకో బారిన పడిన తెలుగమ్మాయ్‌

Update: 2015-08-27 08:12 GMT
అర్చన శాస్త్రి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. పక్కా తెలుగమ్మాయ్‌. పక్కా ప్రొఫెనల్‌ యాక్ట్రెస్‌. నటనే జీవితంగా భావించి కెరీర్‌ ని సాగిస్తోంది ఈ భామ. అప్పట్లో పంచమి అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించి ఆట్టుకుంది. నేను సినిమాలో అర్చన నటనకు చక్కని గుర్తింపు దక్కింది. ఇలా చెప్పుకుంటే అర్చన మెరుపులు ఎన్నో. ఎన్నెన్నో.

లేటెస్టుగా ఈ భామ మరో ప్రయోగాత్మక హారర్‌ చిత్రంలో నటిస్తోంది. హోటల్‌ రెడ్‌ రన్‌ అనేది టైటిల్‌. ఇదో సైకో హారర్‌ థ్రిల్లర్‌. 1975లో రిలీజైన 'ది టెక్సాస్‌ చైన్‌ సా మసాకేర్‌' నుంచి ఇన్‌ స్పయిర్‌ అయ్యి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైకలాజికల్‌ డిజర్డర్‌ ఉన్న ఓ లేడీ ఆమె సోదరులతో కలిసి ఓ హోటల్‌ ని నిర్వహిస్తుంటుంది. ఆ హోటల్‌ లోకి చేరిన కథానాయిక ఎలా బుక్కయ్యింది? అన్నదే సినిమా. ఆద్యంతం రోమాలు నిక్కబొడుచుకునే థ్రిల్లింగ్‌ మూవ్‌ మెంట్స్‌ తెరపై కనిపిస్తాయని అర్చన చెబుతోంది.

ఫైజల్‌ సైఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  కన్నడ నటి కవిత రాధేశ్యమ్‌ విలన్‌ గా నటిస్తున్నారు. అక్టోబర్‌ చివరిలో సెట్స్‌ కెళతాం. తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పింది అర్చన.
Tags:    

Similar News