బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ రామ్ పాల్ మరియు నటి.. మోడల్ అయిన గ్యాబ్రియెల్లా డిమిట్రియాడెస్ లు గత కొంత కాలంగా కలిసి ఉంటున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఇద్దరు బాహాటంగానే ఒప్పుకున్నారు. కొన్నాళ్ల క్రితం భార్య నుండి విడాకులు తీసుకున్న అర్జున్ రామ్ పాల్ గ్యాబ్రియెల్లాతో సహజీవంన సాగిస్తున్నాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులు అయ్యారు.
కొన్ని రోజుల క్రితం గ్యాబ్రియెల్లా గర్బవతి అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేశారు. తాజాగా గ్యాబ్రియెల్లా ముంబయిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయంను బాలీవుడ్ వర్గాల వారు అధికారికంగా దృవీకరించారు. పెళ్లి చేసుకోకుండానే ఈమద్య కాలంలో తల్లిదండ్రులు అవ్వడం కామన్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన వీరిద్దరు పెళ్లికి ముందే తల్లిదండ్రులు అయ్యారు. మరి తల్లిదండ్రులు అయిన తర్వాత అయినా పెళ్లి చేసుకుంటారో చూడాలి.
దాదాపు పది సంవత్సరాల క్రితం అర్జున్ రామ్ పాల్ మరియు గ్యాబ్రియెల్లా లు ఒక పార్టీలో కలిశారు. ఇద్దరి మద్య స్నేహం ఏర్పడింది. మొదట స్నేహితులుగానే కొనసాగిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. సహజీవనం చేశారు. చివరకు తల్లిదండ్రులు అయ్యారు. నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన అర్జున్ రామ్ పాల్ కెరీర్ ఈమద్య కాలంలో కాస్త స్లో గా సాగుతుంది. మరో వైపు గ్యాబ్రియెల్లా కూడా ఈమద్య కాలంలో బాలీవుడ్ సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. డెలవరీ అయ్యింది కనుక మళ్లీ కొన్నాళ్లకు సినిమాలతో ఈమె బిజీ అవ్వనుందేమో చూడాలి.