బాలీవుడ్ హీరోల ఫ్యామిలీ లైఫ్ కలతల గురించి రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. అమీర్ ఖాన్.. సైఫ్ ఖాన్.. హృతిక్ రోషన్.. ఆర్భాజ్ ఖాన్ .. ఇర్ఫాన్ ఖాన్ ఒకరేమిటి పలువురు హీరోల వైవాహిక జీవితంలో కలతలు తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో అర్జున్ రాంపాల్ పేరు చేరింది. అంతేకాదు అతడి లైఫ్ లో మరో కొత్త మలుపు గురించిన సమాచారం వేడెక్కిస్తోంది.
దాదాపు 20ఏళ్ల పాటు కాపురం చేసిన భార్యకు విడాకులిచ్చి ప్రస్తుత గాళ్ ఫ్రెండ్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్నాడు సీనియర్ హీరో అర్జున్ రాంపాల్. గత ఏడాది తన భార్యామణి మెహ్ర్ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించాడు. 1998లో ఈ జంట వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు టీనేజీ డాటర్స్ ఉన్నారు. అయితే తన వైఫ్ కి విడాకులిచ్చి తన జీవితంలోకి కొత్త గాళ్ ఫ్రెండ్ ని ఇన్వయిట్ చేస్తున్న ఈ డాడ్ కి టీనేజీ డాటర్స్ నుంచి పూర్తి సపోర్ట్ దక్కడం ఇంట్రెస్టింగ్. ఐదేళ్లుగా తన భార్యతో టెర్మ్స్ సరిగా లేక నరకం చూశానని అర్జున్ రాంపాల్ ఓపెన్ గా చెప్పాడు. రెండేళ్ల పాటు విదేశీ గాళ్ ఫ్రెండ్ దిమిత్రీతో రహస్యంగా ఎఫైర్ నడిపించాడు. అటుపై ఓపెన్ అయిపోవడం.. ప్రస్తుతం తన జీవితంలోకి క్లీన్ గా ఇన్వయిట్ చేయడం చకచకా జరిగిపోయాయి.
ఈ సంగతిని అర్జున్ రాంపాల్ స్వయంగా చెప్పాడు. ఇకపోతే అతగాడి యాక్టివిటీని మాజీ భార్య సైతం లైట్ తీస్కోవడం ఆసక్తికరం. ప్రస్తుతం అర్జున్ రాంపాల్ తన కొత్త గాళ్ ఫ్రెండ్ గాబ్రియెలా దిమిత్రీతోనే షికార్లు చేస్తూ కనిపిస్తున్నాడు. ముంబైలో ఖరీదైన రెస్టారెంట్లలో ఈ జంట షికార్లు మీడియా కంటికి రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. తన గాళ్ ఫ్రెండ్ ఫ్రెగ్నెన్సీ వార్తను అర్జున్ రాంపాల్ గత ఏడాది ఏప్రిల్ లో కన్ఫామ్ చేశాడు. త్వరలోనే అతడు మూడో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. గాళ్ ఫ్రెండ్ శ్రీమంతానికి లావిష్ గా ఏర్పాట్లు చేస్తున్నాడట. ఆగస్టులో ఈ జంటకు బిడ్డ జన్మించనుంది. అలాగే మాజీ భార్య మెహ్ర్ తో ఆర్థిక సంబంధ వ్యవహారాల్ని అర్జున్ రాంపాల్ సెటిల్ చేసుకోనున్నాడట.