అర్థనగ్న ఫొటో పోస్ట్‌ చేసి హీరో పరువు తీసింది

Update: 2018-11-30 13:07 GMT
బాలీవుడ్‌ లో లవ్‌ అఫైర్లు అనేవి చాలా కామన్‌. విడాకులు తీసుకుని మళ్లీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది బాలీవుడ్‌ లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఒక వైపు బాలీవుడ్‌ లో దీపిక పదుకునే - రణ్‌ వీర్‌ సింగ్‌ ల వివాహం - ప్రియాంక చోప్రా - నిక్‌ ల వివాహం గురించి తెగ చర్చ జరుగుతున్న ఈ సమయంలో బాలీవుడ్‌ హీరో అర్జున్‌ రాంపాల్‌ ప్రేమ వ్యవహారం సంచలనంగా మారింది. ఈమద్యే భార్య నుండి విడాకులు తీసుకున్న అర్జున్‌ రాంపాల్‌ గ్యాబ్రిల్లా డీమిట్రియాడెస్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

రామ్‌ పాల్‌ విషయంలో మీడియాలో జరుగుతున్న చర్చ నిజమా అబద్దమా అంటూ కొందరు అనుమానంలో ఉండగా గ్యాబ్రిల్లా పోస్ట్‌ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం వీరి ఇష్యూపై క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. అర్థ నగ్నంగా - గాఢ నిద్రలో ఉన్న అర్జున్‌ రాంపాల్‌ ఫొటోను పోస్ట్‌ చేసిన గ్యాబ్రిల్లా ఇతడు ప్రతి రోజు నా వద్దకు వచ్చి నలిపేస్తాడు అంటూ కామెంట్‌ పెట్టింది. దాంతో వీరిద్దరి విషయం చాలా దూరం వెళ్లిందని - చాలా కాలంగా సాగుతుందని తేలిపోయింది.

ఉన్నట్లుండి గ్యాబ్రిల్లా ఈ ఫొటోను పోస్ట్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటా అని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ ఫొటో పోస్ట్‌ చేసిన విషయం రాంపాల్‌ కు తెలిసి ఉంటుందా అని కొందరు - వ్యవహారంను బట్ట బయలు  చేసేందుకు గ్యాబ్రిల్లా ఈ ప్లాన్‌ వేసిందని మరి కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారంను రివీల్‌ చేయాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. అన్ని వదిలేసి ఇలా అర్థనగ్న ఫొటో పెట్టి రాంపాల్‌ పరువు తీయడం ఏంటంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోపై రాంపాల్‌ ఎలా స్పందిస్తాడనేది చూడాలి.

Tags:    

Similar News