స్టార్ కిడ్స్ ను లాంఛ్ చేయడంలో స్పెషలిస్ట్ గా నిర్మాత అశ్వినీదత్ కు బోలెడంత అనుభవం ఉంది. ఎంత పెద్ద స్టార్ అయినా తమ వారసులను రంగంలోకి దించాలంటే.. ముందుగా నిర్మాత అశ్వనీదత్ నే సంప్రందించేవారు. ఈ విషయంలో ఎన్టీఆర్.. బన్నీలను లక్కీ అని చెప్పాలి.
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తొలి మూవీ నిన్ను చూడాలని. ఇది ఎవరికీ నచ్చలేదు. నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ ని అంగీకరించే పరిస్థితి కూడా లేదు. అప్పుడు హరికృష్ణ స్వయంగా అశ్వనీదత్ కి ఫోన్ చేసి పరిస్థితి వివరించారట. ఆ టాపిక్ పై అశ్వనీదత్- రాఘవేంద్రరావులు ఓ స్టోరీ సిద్ధం చేసుకుని.. దర్శకేంద్రుడి దగ్గర అసిస్టెంట్ గా ఉన్న రాజమౌళిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన మూవీ స్టూడెంట్ నెంబర్ 1. ఇది బ్లాక్ బస్టర్ కావడంతో.. ఎన్టీఆర్ తిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.
ఇక అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇందుకు దగ్గరగానే ఉంటుంది. అప్పట్లో ఫామ్ లో ఉన్న తేజ డైరెక్షన్ లో బన్నీ హీరోగా ఓ మూవీ స్టార్ట్ అయింది. ఓ షెడ్యూల్ కూడా పూర్తయ్యాక.. అల్లు అరవింద్ శాటిస్ఫై కాలేదు. అదే విషయం అశ్వినీదత్ చెవిన వేయడం.. అప్పటికే అశ్వినీదత్-రాఘవేంద్రరావుల దగ్గర గంగోత్రి స్క్రిప్ట్ సిద్ధంగా ఉండడం.. అంతా స్నేహితులు కావడంతో.. గంగోత్రితో బన్నీ లాంఛింగ్ జరిగిపోయింది. హిట్ కూడా కొట్టేశాడు. ఇలా ఇద్దరికీ అదృష్టం కలిసొచ్చింది.
ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా తన వారుసుడు మహేష్ బాబును అరంగేట్రం అశ్వినీదత్ బ్యానర్ వైజయంతీ ద్వారానే చేయించారు. దీనికి కూడా కె. రాఘవేంద్రరావే దర్శకుడు. ఇక రామ్ చరణ్ సంగతి తెలిసిందే. చిరుత అంటూ వైజయంతీ బ్యానర్ లో పూరీ డైరెక్షన్ లో లాంఛ్ అయి.. చిరు తనయుడు అనిపించుకున్నాడు. స్టార్ కిడ్స్ ని లాంఛ్ చేయడంలో అశ్వినీదత్ స్పెషాలిటీ అదీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/