బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి గారాల కుమార్తె ఆతియా శెట్టి - టీమిండియా యువ క్రికెటర్ KL రాహుల్ జంట ప్రేమాయణం గురించి తెలిసిందే. ఈ జంట డేటింగ్ వ్యవహారంలో ప్రతిదీ బహిరంగమే. ప్రేమ ఫలించి ఇప్పటికి పెళ్లి ఘడియలు ఆసన్నమయ్యాయి. గత కొంతకాలంగా ఈ జంట పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఇరువైపులా కుటుంబాలు పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేసాయని కబురందింది. ఈ అందమైన జంట వివాహంతో తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. 2023 జనవరి 21 నుండి 23 వరకు లవ్ బర్డ్స్ తమ వివాహ వేడుకల్ని ఉల్లాసంగా జరుపుకుంటారని టాక్ వినిపిస్తోంది. డిసెంబరు చివరి నాటికి ఈ జంట శుభలేఖలను ముద్రించి ఆహ్వానాలను పంపుతారని.. జనవరి 21 నుండి 23 వరకు తమ తేదీలను బ్లాక్ చేయమని అతిథులను కోరతారని ఆథియా శెట్టి కుటుంబానికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
పెళ్లికి కొద్ది రోజులే మిగిలి ఉండటంతో ఇరువైపులా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అయితే అతియా శెట్టి కుటుంబం ఈ పరిణామాలపై వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నందున దీనిపై అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఇటీవల సునీల్ శెట్టి తన కుమార్తె అతియా శెట్టి -KL రాహుల్ వివాహాన్ని ధృవీకరించడం మినహా ఇతర వివరాలేవీ వెల్లడి కాలేదు.
తాజా గుసగుసల ప్రకారం.. హల్దీ- మెహెందీ- సంగీత్ వేడుకలతో మోస్ట్ అవైటెడ్ సెలబ్రిటీ వెడ్డింగ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అతియా - రాహుల్ జంట అంగరంగ వైభవంగా సౌత్ ఇండియన్ స్టైల్ లో ఈ పెళ్లి వేడుక కోసం సిద్ధమవుతున్నారని తెలిసింది. వివాహ వేడుకలు సునీల్ శెట్టికి చెందిన విలాసవంతమైన ఖండాలా బంగ్లా-జహాన్ లో జరిగే అవకాశం ఉంది.
నవంబర్ ప్రారంభంలో సునీల్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన క్రమంలో తన కుమార్తె పెళ్లి వార్తలను ధృవీకరించాడు. జల్దీ హోగీ అంటూ అతడు వ్యాఖ్యానించడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. ఇంతలోనే జనవరి 2023లో కేఎల్ రాహుల్ వ్యక్తిగత సెలవును బీసీసీఐ ఆమోదించడంతో ఇది 'పెళ్లి ఘడియలు' ఆసన్నమవ్వడమేనంటూ ట్విట్టర్ లో టాక్ స్ప్రెడ్ అయ్యింది. అథియా శెట్టి - KL రాహుల్ చాలా సంవత్సరాలుగా స్థిరమైన సంబంధంలో ఉన్నారు. ఇటీవల కలిసి ముంబై- బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఉన్న విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ప్రేమ గూడులోకి చేరారు. తమ అభిమాన జంట పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ ఈ వార్త ప్రకంపనంగా మారింది.
2021లో తన సోదరుడు అహన్ శెట్టి తొలి చిత్రం 'తడప్' ప్రీమియర్ లో KL రాహుల్ తో అతియా తన రిలేషన్ షిప్ ని బహిరంగపరిచింది. అంతకుముందు చాలా కాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నారని హింట్ అందింది. ఆ తర్వాత ఈ జంట వివాహం 2023 ప్రారంభంలో (జనవరి-ఫిబ్రవరి) జరిగే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. ఎట్టకేలకు పెళ్లికి తేదీ లాక్ అయ్యింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.