ఔను మేమిద్దరం ప్రేమలో ఉన్నాం

Update: 2021-11-08 02:30 GMT
బాలీవుడ్‌ హీరోయిన్స్‌.. టీమ్‌ ఇండియా క్రికెటర్స్ కు ప్రేమ అనేది చాలా కామన్ విషయం. ఇది ఎప్పటి నుండో వస్తుంది. కొందరు ప్రేమతో సరిపెడితే కొందరు రిలేషన్‌ షిప్ వరకు వెళ్తారు. కొద్ది మంది మాత్రం పెళ్లి వరకు కూడా వెళ్తారు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అనుష్క శర్మను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత చాలా మంది అంతకు ముందు చాలా మంది కూడా ఇలా వివాహాలు చేసుకున్నారు. ఆ జాబితాలో మరో జంట చేరబోతుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ అతియా శెట్టి గత కొన్నాళ్లుగా కేఎల్‌ రాహుల్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఇద్దరి వ్యవహారం చాలా రోజులుగా చర్చ జరుగుతుంది కాని అధికారికంగా మాత్రం తెలియజేయలేదు. రాహుల్‌ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అతియా కూడా అక్కడకు వెళ్లగా అప్పుడు కన్ఫర్మ్‌ అయ్యింది.

అతియా శెట్టి తండ్రి కూడా ఒకానొక సమయంలో మాట్లాడుతూ తన జీవితం తనకు క్లారిటీ ఉంది. ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉందని ప్రేమను అంగీకరిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పేశాడు. అతియా శెట్టి ప్రేమ విషయంలో ఇన్ని రోజులు మీడియా ముందుకు వచ్చిన సమయంలో నోరు మెదపలేదు. రాహుల్‌ కూడా ఆ విషయాన్ని ఎక్కువగా సాగదీయకుండా స్పందించేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు వీరి ప్రేమ వ్యవహారం పై అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఎట్టకేలకు వీరిద్దరు ప్రేమలో ఉన్నారని స్వయంగా వారి ద్వారానే ప్రకటన వచ్చింది.

తాజాగా అతియా శెట్టి పుట్టిన రోజు జరిగింది. ఆ సమయంలో తన ప్రేమ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. మేము ప్రేమలో ఉన్నాం అంటూ ఆమె సింపుల్‌ గా సోషల్‌ మీడియా ద్వారా ఫొటోలను షేర్ చేసి తెలియజేసింది. 2019 నుండి వస్తున్న ఊహాగాణాలకు వార్తలకు ఒక క్లారిటీ ఇచ్చేసింది. వీరిద్దరి ప్రేమ విషయం క్లారిటీ రావడంతో ఇకపై పెళ్లి ఎప్పుడు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చే అవకాశం ఉంది. మేము ఇద్దరం ప్రేమలో ఉన్నట్లుగా అతియా శెట్టి నుండి ప్రకటన వచ్చిన నేపథ్యంలో కేఎల్‌ రాహుల్ స్పందన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2022 లో వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Tags:    

Similar News