ప్రజలను దోపిడీ చేయడానికి పలు మార్గాలు. ఇందులో ఇష్టానుసారం ధరల్ని పెంచుకోవడం ఒక మార్గం. ఈ దారిని ఎంచుకునేందుకు వ్యాపారులు వెనకాడరు. తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జన ఎలా చేయాలో ఫార్ములాస్ ని ప్రజలపై ప్రయోగిస్తారు. కానీ ఇలాంటి దుర్మార్గం వల్ల వినోద పరిశ్రమకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని.. థియేటర్లలో ప్రజల నిలువు దోపిడీ ప్లానింగ్ సరికాదని నెత్తి నోరు బాదుకుని విశ్లేషించేవాళ్లున్నారు. ప్రజలు మునుపటిలా లేరు. ప్రతిదీ బడ్జెట్ లెక్కలు వేసుకుని మరీ చివరిలో వినోదానికి బడ్జెట్లు కేటాయిస్తున్నారు. అలా థియేటర్లకు వచ్చే వారి శాతం సగానికి సగం పడిపోయింది.
ఇలాంటి సన్నివేశంలో టికెట్ ధరల్ని తగ్గించాల్సింది పోయి క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకునేందుకు భారీ ఎత్తున నిలువు దోపిడీకి పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. ఒకప్పటి సాంప్రదాయ బిజినెస్ కి విరుద్ధంగా నేటి ఎగ్జిబిషన్ రంగం తీరుతెన్నులు మారాయని ప్రముఖ ఎగ్జిబిటర్ వ్యాఖ్యానించారంటే దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.
తాజాగా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ఇండియాలో భారీ వసూళ్లను సాధిస్తోందని ట్రేడ్ చెబుతోంది. ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చినా ఆ ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పని చేయలేదు. అవతార్ 2 హై టెక్నికల్ వాల్యూస్ .. విజువల్ ఎఫెక్ట్స్ సినిమా హాళ్లకు జనం వచ్చేలా చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అద్బుతంగా రన్ అవుతోంది. కానీ ఈ సినిమాని మెజారిటీ జనం ఇంకా చూడలేదు. దీనికి ఒక కారణం అధిక టికెట్ ధరలు కూడా. మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలను థియేటర్లకు రప్పించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకూ భారతదేశంలో అవతార్ 2 చూడని జనం 80శాతం పైగా ఉన్నారన్నది ఒక సర్వే. మరి వీళ్లందరినీ థియేటర్లకు రప్పించాలంటే ఏదో ఒకటి చేయాలి కదా? ఇప్పుడు బిజినెస్ మేన్ లు తెలివిగా గేమ్ ప్లాన్ మార్చారు. రేపటి నుంచి 'అవతార్ 2' ఇండియాలో 3డి వెర్షన్ టిక్కెట్ రేట్లు గణనీయంగా తగ్గనున్నాయన్న ప్రకటన ఒక ప్రకంపనం. IMAX - 4DX కాకుండా ఇతర ఫార్మాట్ ల కోసం టికెట్ ధరలు దాదాపు రూ. 150గా నిర్ణయించనున్నారు. ఇది ఎక్కువ మంది ప్రేక్షకులను తీసుకురావడానికి మంచి చర్య. ముఖ్యంగా 3డి వెర్షన్ ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం ముదావహం. ఒక్కో టికెట్ కోసం 300-400 ఖర్చు చేయాలంటే ప్రజలు భయపడతారు. కుటుంబ సమేతంగా ఒక సినిమా వీక్షణ కోసం రూ.3000 పైగా (టికెట్.. పాప్ కార్న్-కోక్ కలుపుకుని) ఒక సినిమాకోసం ఖర్చు చేయడం అంటే అది అసాధ్యం. కానీ ఇప్పుడు తగ్గిన ధరలతో సామాన్యుడు కూడా సినిమాని వీక్షించగలడు. ఇది అవతార్ పంపిణీ వర్గాల తెలివైన నిర్ణయం అని పొగడాలి.
ఏదేమైనా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన భారీ వెంచర్ బ్రేక్ ఈవెన్ సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన రన్ ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ సినిమా ఇప్పటి వరకూ కేవలం 4000 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అవతార్ ఫుల్ రన్ లో 18000 కోట్లు వసూలు చేసింది. ఆ స్థాయి వసూళ్లను తేవాలంటే ఈ సినిమా సుదీర్ఘ కాలం థియేటర్లకు జనాల్ని రప్పించాల్సి ఉంటుంది. ప్రజలు థియేటర్లలో 3డి వెర్షన్ మాత్రమే చూడాలని కసిగా ఉంటే మాత్రమే ఇది సాధ్యం. అయితే దానికి టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం సహకరిస్తుందనడంలో సందేహం లేదు. అవతార్ 2 ఎగ్జిబిషన్ పంపిణీ వర్గాల తాజా నిర్ణయం ఆహ్వానించదగినది. ఈ క్రిస్మస్ హాలిడే సీజన్ సినిమాకు కొంత వరకు హెల్ప్ కావాలి.
సామ్ వర్తింగ్టన్- జో సల్దానా- సిగౌర్నీ వీవర్- స్టీఫెన్ లాంగ్- క్లిఫ్ కర్టిస్- జెమైన్ క్లెమెంట్ - కేట్ విన్స్ లెట్ ఈ అధిక-బడ్జెట్ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.