సినిమా పైరసీ అంటే కెమెరా పట్టుకుని చాటుగా కూర్చుని రికార్డ్ చేస్తేనే కాదు. మొబైల్ కెమెరా పెట్టి ఒక చిన్న సీన్ రికార్డ్ చేసినా అది కూడా పైరసీనే. ఇది కూడా చట్ట వ్యతిరేకమే. దీనికి కూడా శిక్షలుంటాయి. కానీ ఆ మాత్రం అవగాహన.. భయం జనాలకు ఎక్కడుంటాయి. పెద్ద సినిమాలు రిలీజయ్యాయంటే దర్జాగా మొబైల్ క్యామ్ ఓపెన్ చేసి తమకు ఓపికున్నంతసేపు రికార్డు చేసి పారేస్తుంటారు జనాలు. దాన్ని మళ్లీ సోషల్ మీడియాలో పెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్లుగా భావిస్తారు. ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో ఈ అత్యుత్సాహం జనాల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
థియేటర్లలో జనాలు సినిమా చూడ్డం కంటే మొబైల్ రికార్డింగ్ మీదే దృష్టిపెడుతూ.. మొత్తం సినిమాను పైరసీ చేసేస్తున్నారు. అప్పుడే సినిమా బిట్లు బిట్లుగా ఆన్ లైన్లోకి వచ్చేసింది. ఈ బిట్లన్నీ కలిపితే మొత్తంగా సినిమా అంతా నెట్లోకి వచ్చేసిందనే చెప్పాలి. ట్విట్టర్లో ‘బాహుబలి-2’ హ్యాష్ ట్యాగ్ కొడితే బోలెడన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. ఇది తప్పు అని జనాలకు తెలియట్లేదు. థియేటర్ల యాజమాన్యాలు కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించట్లేదు. ఇలా మొబైల్ ద్వారా రికార్డ్ చేస్తున్న వాళ్లపై చర్యలేమైనా తీసుకుంటే తప్ప తీవ్రత తెలిసి రాదేమో. కనీసం థియేటర్ల ముందు హెచ్చరికల బోర్డులు పెట్టడం.. షో మధ్యలో సిబ్బంది ఒకసారి మానిటర్ చేయడం లాంటివి జరక్కపోతే.. మున్ముందు పరిస్థితి తీవ్రత మరింత పెరిగే ప్రమాదముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/