రాజమౌళి పక్కాగా ప్లాన్ చేశాడు. 'బాహుబలి' చిత్రాన్ని ముందు చెప్పినట్టుగానే 2015 సమ్మర్‌కే తీసుకొస్తున్నాడు. ఒకే సినిమాగా తీయాలనుకొన్నా నిడివి పెద్దది కావడంతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. తొలి భాగం మే 15న వస్తే, రెండో భాగం సినిమాని 2016 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆ విషయాన్ని బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని స్వయంగా వెల్లడించారు. అయితే అందరూ అనుకొంటున్నట్టుగా ఈ సినిమాల బడ్జెట్ వంద కోట్లు మాత్రం కాదు. 220కోట్లపైగానే ఖర్చవుతోందట. ఆ లెక్కన చూస్తే దక్షిణాదిలోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలుగా రికార్డు సృష్టించినట్టు అవుతాయి. ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో చూడని విధంగా గ్రాఫిక్స్ ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇంటర్నేషనల్ హంగులతో తీసిన ఈచిత్రంతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
'బాహుబలి2'కి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని ఇప్పటికే తెరకెక్కించారు. మిగిలిన సన్నివేశాల్ని కూడా పూర్తి చేసేందుకు ఆగస్టు నుంచి మరో విడత చిత్రీకరణ మొదలుపెడతారు. అప్పట్నుంచి నవంబరు వరకు ఏకధాటిగా చిత్రీకరణ చేపడతారు. డిసెంబరులో పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేస్తారు. రెండు సినిమాల్నీ మంచి సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి 'బాహుబలి' నిర్మాతల పంట పండినట్టే. అన్నట్టు రాజమౌళి కూడా ఈ సినిమాల లాభాల్లో వాటా తీసుకొంటాడు.