బాహుబ‌లి నిర్మాతల సిరీస్ కి ప్ర‌భాస్ ప్ర‌చారం

Update: 2022-06-11 04:31 GMT
బాహుబ‌లి ఫ్రాంఛైజీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. డార్లింగ్ ప్ర‌భాస్ కి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫేం తెచ్చిన సంస్థ ఇది. అలాంటి సంస్థ కు త‌న‌వంతు ప్ర‌మోష‌న‌ల్ స‌హ‌కారం అందించేందుకు డార్లింగ్ కాద‌న‌డ‌నేది ఎంతో నిజం. ఇప్పుడు ఆర్కా మీడియా నిర్మించిన 'అన్యాస్ ట్యుటోరియల్' తెలుగు వెబ్ సిరీస్ కి ప్రభాస్ త‌న‌వంతు ప్ర‌మోష‌న‌ల్ సాయం అందిస్తున్నారు.

ఈ సిరీస్ కి సౌమ్య శర్మ రచ‌యిత కాగా.. ప‌ల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇది ఆహా OTT ఒరిజినల్ సిరీస్. ఇందులో  రెజీనా కసాండ్రా- నివేదిత సతీష్ - అగస్త్య త‌దిత‌రులు నటించారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ- ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ఈ సిరీస్ స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఇంత‌లోనే ప్ర‌చారానికి తెర తీసింది చిత్ర‌యూనిట్. తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్ ఆద్యంతం ర‌క్తి కట్టించింది. ప్ర‌భాస్ ఈ టీజ‌ర్ ని రిలీజ్ చేసి టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అన్యాస్ ట్యూటోరియ‌ల్ టైటిల్ లోనే బోలెడంత నిగూఢ‌త ఘాడ‌త క‌నిపిస్తోంది. ఈ టైటిల్ కి త‌గ్గ‌ట్టే హార‌ర్ కంటెంట్ టీజ‌ర్ ఆద్యంతం ఉత్కంఠ పెంచుతోంది.

హార‌ర్ థ్రిల్ల‌ర్ కి త‌గ్గ నేప‌థ్య సంగీతం కుదిరింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ వెబ్‌ సిరీస్ లో ట‌ర్నులు ట్విస్టులు ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఒక అంద‌మైన అమ్మాయి ట్యూటోరియ‌ల్ లో ఒంట‌రిగా రేయంతా గ‌డిపితే అనంత‌ర ప‌రిణామాలు ఎలా ఉన్నాయి? అన్న‌ది తెర‌పై చూపిస్తున్నారు. ఇద్ద‌రు అక్కా చెల్లెళ్ల న‌డుమ సంఘ‌ర్ష‌ణ కూడా క‌నిపిస్తోంది.

ఇందులో ర‌క‌ర‌కాల పాత్ర‌ల ప‌రిచ‌యం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. అన్యా స్ ట్యుటోరియల్ హారర్ వెబ్ సిరీస్ జూలై 1 నుండి ఆహా వీడియో OTTలో ప్రసారం కానుంది. పల్లవి గంగిరెడ్డి ఈ సిరీస్ తో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

హార‌ర్ థ్రిల్ల‌ర్ల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ బావుంటుంది. అయితే స్టోరీ నేరేష‌న్ ఎంత గ్రిప్పింగ్ గా ఉంది? అన్న‌దే కొల‌మానం. విజువ‌ల్స్ ప‌రంగా సౌండ్ టెక్నిక్స్ ప‌రంగా హై స్టాండార్డ్స్ లో ఈ సిరీస్ ని ఆర్కా సంస్థ నిర్మించింద‌ని టీజ‌ర్ ప్రామిస్ చేసింది.

Full View


Tags:    

Similar News