పాత్ర కోసం ఎంతకైనా తెగించే తత్వం కొందరికే ఉంటుంది. ఈ విషయంలో మన వెటరన్ హీరోల తెగువ మెచ్చదగినదే. మెగాస్టార్ చిరంజీవి(64)- కింగ్ నాగార్జున(60)- నటసింహా బాలకృష్ణ(59)- విక్టరీ వెంకటేష్ (59) ఎప్పటికప్పుడు బరువు తగ్గేందుకు లేదా అదుపులో ఉంచుకునేందుకు జిమ్ముల్లో ఎంతో శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కొరటాలతో సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 10-15 కేజీలు తగ్గారని ప్రచారమైంది. చిరు మేకోవర్ ఫోటోలు జోరుగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాలయ్య వంతు. ప్రస్తుతం బోయపాటితో సినిమా కోసం బాలయ్య సాహసం చూస్తుంటే ఔరా! అని నోరెళ్లబెట్టకుండా ఉండలేం. ఆయన నిరంతర కసరత్తులతో శ్రమిస్తూ దాదాపు 25 కేజీల మేర బరువు తగ్గారని తెలుస్తోంది.
10 జూన్ నాటికి బాలయ్య ఏజ్ 60 పూర్తవుతోంది. అంటే షష్ఠిపూర్తికి ఆయన సిద్ధమవుతున్నారన్నమాట. అయితే ఈ వయసులోనూ ఆయన రెట్టించిన ఉత్సాహంతో నటిస్తున్నారు. ఎంతో కమిట్ మెంట్ తో హార్డ్ వర్క్ చేస్తూ బరువు తగ్గుతున్నారు. తాజా చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారన్న ప్రచారం ఉంది. అలాగే అఘోరాగానూ నటిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సెంటిమెంటు ఎంటర్ టైనర్ ఇదని ప్రచారమవుతోంది. సింహా- లెజెండ్ తర్వాత బాలయ్యకు ఎట్టి పరిస్థితిలో హ్యాట్రిక్ ఇవ్వాలన్న పంతంతో బోయపాటి పని చేస్తున్నారు. ఇక బరువు విషయంలో ఇతర స్టార్లు చిరు- బాలయ్యలానే ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. వెంకీ- నాగ్ ఎప్పుడూ వెయిట్ ఓవర్ బోర్డ్ అయిపోకుండా జాగ్రత్తగా ఉంటారు.