118 ఈవెంట్ కోసం బాబాయ్ అబ్బాయిలు!

Update: 2019-02-24 12:06 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో '118' అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే రిలీజ్ అయిన '118' ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

ఫిబ్రవరి 25 వ తారీఖున జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరగనుందని నిర్మాతలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ హాజరవుతున్నారని కూడా నిర్మాతలు కన్ఫాం చేశారు.  బాలయ్య.. ఎన్టీఆర్ లు కలిసి ఒకే వేదిక మీద కనపడడం అభిమానులకు ఎప్పుడూ ఆనందాన్నిచ్చేదే.  ఇద్దరిమధ్య సంబంధాలు సరిగా లేవని రూమర్లు వస్తూనే ఉన్నాయి కానీ ఆ రూమర్లకు చెక్ పెట్టేలా ఇద్దరూ కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  'అరవింద సమేత' ఆడియో ఫంక్షన్ కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.  ఇప్పుడు మరోసారి కళ్యాణ్ రామ్ సినిమా కార్యక్రమంలో ఇద్దరూ  వేదిక పంచుకోనున్నారు.  

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి తారక్ తన స్పందన తెలపకపోవడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఆ విమర్శలకు సమాధానం ఇస్తాడేమో వేచి చూడాలి.  మరోవైపు 'ఎన్టీఆర్ మహానాయకుడు' దారుణ ఫలితం నేపథ్యంలో బాలయ్య కూడా ఏం మాట్లాడతాడో అనే ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఏదేమైనా బాలయ్య - తారక్ కలయికపై  అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News