బాలయ్య తన డైలాగ్ తో ఎవరిని టార్గెట్ చేశారు...?

Update: 2020-06-10 07:10 GMT
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలయ్య 60వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. బాలయ్య షష్టి పూర్తి సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బాలయ్యకు పుట్టిన రోజు శభాకాంక్షలు తెలుపుతూ సందడి చేస్తున్నారు. వాళ్ల సంబరాలని ఏమాత్రం తగ్గకుండా బాలయ్య కూడా తన 106 సినిమా టీజర్ రిలీజ్ చేశారు. బాలయ్య - బోయపాటి శ్రీను మాసివ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్‌ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సింహా' 'లెజెండ్‌' విజయాల తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి తగినట్లుగానే విభిన్నమైన కథ - కథనాలతో  భారీగా ఈ సినిమా తెరకెక్కుతోంది’ అని తెలుస్తోంది. కాగా బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ‘ఫస్ట్‌ రోర్‌' పేరుతో సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో పంచెకట్టులో మీసాన్ని మెలితిప్పుతూ మాస్‌ లుక్‌ లో బాలయ్య అదరగొట్టాడు. ''ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి... శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనే దానికి.. శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది రా..'' అంటూ బాలయ్య చెప్పిన శక్తివంతమైన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ పై సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ చేసారు.

బాలయ్య ఈ టీజర్ లో వాడిన కొన్ని బీప్ డైలాగ్స్ ఫై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అభిమానులు మాత్రం పల్లెటూర్లలో మాములుగా వాడే పదాలనే వాడారని వెనకేసుకు వస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఈ డైలాగ్స్ ఎవరినో ఉద్దేశించి ఈ సినిమాలో పెట్టారని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఒక మినిస్టర్ తరచూ బాలయ్య డైలాగ్ లో ఉన్న మాటలను అంటూ ఉంటారని.. టీడీపీ పార్టీని నాయకులను టార్గెట్ చేస్తూ ఉండే అతనికి కౌంటర్ గానే బాలయ్య ఈ డైలాగ్స్ రాయించి ఉంటారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆ మినిస్టర్ అభిమానులు మాత్రం ఈ డైలాగ్స్ కి కౌంటర్ ఇస్తున్నారు. 'మీరు రీల్ హీరోలని.. మా అన్న రియల్ హీరో' అని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం మెగా బ్రదర్ నాగబాబుని టార్గెట్ చేసి ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాలలో కూడా అప్పటి ప్రభుత్వాలను ఉద్దేశించి కొంతమంది నాయకులను టార్గెట్ చేస్తూ డైలాగ్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ డైలాగ్స్ కూడా ఎవరినో టార్గెట్ చేస్తూ ఉన్నాయని.. ఇలాంటివి ఇంకా సినిమాలో చాలా ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ చేసుకుంటున్నారు.


Tags:    

Similar News