బాలయ్య అంత ఓపెన్ గా జోకేశాడే

Update: 2018-03-29 13:37 GMT
సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోది ఒక్కో తీరు. ఒకాయన పొద్దున్నే వచ్చి సెట్ లో కూర్చుంటాడు. ప్రొజెక్టర్ చూసుకుంటూ ఉంటాడు. ఇంకొకాయన వచ్చినా అక్కడేం జరిగినా తనకు పట్టనట్లుగా పని చేసుకుంటాడు. ఇంకో హీరో అయితే మహా స్ట్రిక్ట్.. అప్పుడప్పుడూ చెయ్యి చేసుకుంటూ ఉంటాడు కూడా. అలాగే షూటింగ్ స్పాట్ కి తెగ లేటుగా వస్తాడని.. దీని మూలంగా షూటింగ్ బాగా ఆలస్యం అవుతుందని ఆరోపణలు ఉన్న హీరో రాజశేఖర్.

మరీ వాళ్లూ వీళ్లూ ఆరోపించనంత కాకపోయినా.. షూటింగ్ కాస్త లేటుగా వచ్చే మాట అయితే వాస్తవమే అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ కూడా అంగీకరించాడు. ఇప్పుడు ఎన్.టీ.ఆర్. చిత్ర ప్రారంభానికి హీరో రాజశేఖర్ కూడా వచ్చాడు. అయితే.. తన అలవాటు ప్రకారం కాసింత ఆలస్యంగానే ఆ ప్రాంతానికి అరుదెంచాడు ఈ సీనియర్ హీరో. అంతే.. బాలయ్య నోటి నుంచి పంచ్ పడిపోయింది. 'బ్రదర్.. యాజ్ యూజువల్.. ఆల్వేస్ లేట్' అంటూ ఓపెన్ గానే అనేశారు బాలయ్య.  'ఎప్పటిలాగే లేటుగానే వచ్చావుగా మళ్లీ'.. అంటూ కౌంటర్ పడిపోయిందన్న మాట. దీనికి ఓ నవ్వు నవ్వి పలకరించడం తప్ప ఏం సమాధానం ఇవ్వలేకపోయాడు ఈ యాంగ్రీ హీరో.

రాజశేఖర్ మాట్లాడుతూ.. తాను మద్రాస్ లో పెరిగినపుడు.. ఎంజీఆర్.. ఎన్టీఆర్ లు చాలా పెద్ద స్టార్లు అని.. ఎంజీఆర్ ని కలిసే అవకాశం రాకపోయినా.. మహనీయుడు ఎన్టీఆర్ తో కలిసి భోజనం చేసి.. ఆయన ఆతిథ్యం స్వీకరించే అదృష్టానికి నోచుకున్నానని.. గతాన్ని గుర్తు చేసుకున్న రాజశేఖర్.. నందమూరి ఫ్యామిలీ అంటే గ్రేట్ అంతే అని తేల్చేశాడు.


Tags:    

Similar News